Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కండోమ్ స్కామ్‌ నుంచి బయటపడేందుకే.. సిద్ధరామయ్య చేతికి కావేరి ఇష్యూ?

కర్ణాటక సర్కారు కండోమ్ కొనుగోలులో అవినీతికి పాల్పడిందని.. ఆ స్కామ్ నుంచి గట్టెక్కేందుకే సిద్ధరామయ్య కావేరి జలాల అంశాన్ని రాద్ధాంతం చేస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రాణాంతక వ్యాధి ఎ

కండోమ్ స్కామ్‌ నుంచి బయటపడేందుకే.. సిద్ధరామయ్య చేతికి కావేరి ఇష్యూ?
, గురువారం, 29 సెప్టెంబరు 2016 (16:37 IST)
కావేరీ నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. అందుకు కర్ణాటక ప్రభుత్వం ససేమిరా అంది. కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయకూడదని అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు అఖిల పక్షంలోనూ నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కారు కండోమ్ కొనుగోలులో అవినీతికి పాల్పడిందని.. ఆ స్కామ్ నుంచి గట్టెక్కేందుకే సిద్ధరామయ్య కావేరి జలాల అంశాన్ని రాద్ధాంతం చేస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్‌ను నియంత్రించడం కోసం కండోమ్‌లను కొనుగోలు చేసేందుకు.. సర్కారు నిధుల్లో రూ.500కోట్ల వరకు అవినీతికి పాల్పడిందని, ఇందులో సీఎం సిద్ధరామయ్య, పారిశుద్ధ్య శాఖా మంత్రుల ప్రమేయం కూడా ఉందని బీజేపీ నేత రమేష్ ఆరోపించింది.
 
రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంఘ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సీఎం సిద్ధరామయ్య.. కేంద్ర ప్రభుత్వం, యూనిసెఫ్, బిల్ గేట్స్ ఛారిటీల నుంచి విరాళంగా అందిన మొత్తంలో అవకతవకలకు పాల్పడినట్లు రమేష్ విమర్శించారు. ఎయిడ్స్ నియంత్రణ కోసం వచ్చే నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, ఇందులో భాగంగా కండోమ్‌లను ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయడంలో అవకతవకలున్నాయని విమర్శలు గుప్పించారు. 
 
ఇంకా ఈ స్కామ్‌లో సిద్ధరామయ్యపై అవినీతి నిరోధక కేంద్రంలో రమేష్ ఫిర్యాదు కూడా చేశారు. ఈ అవినీతిని కప్పిపుచ్చేందుకే సిద్ధరామయ్య కావేరీ జలాల అంశాన్ని వివాదం చేస్తూ.. సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించేందుకు సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ జియో ఇంటర్నెట్ స్లోగా ఉందా... అయితే ఇలా చేయండి