Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్ బుక్ ప్రేమ.. ఒకరి కౌగిలిలో మరొకరు బందీలుగా మారారు.. అంతలో పోలీసులొచ్చారు..!

ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు.. ప్రేమించానన్నాడు.. తీరా కలుసుకునే సరికి అడ్డంగా బుక్కయ్యాడు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 17 ఏళ్ళ‌ అబ్బాయికి ఫేస్‌బుక్‌లో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి పేరు జిందా. ఈ ఇద

ఫేస్ బుక్ ప్రేమ.. ఒకరి కౌగిలిలో మరొకరు బందీలుగా మారారు.. అంతలో పోలీసులొచ్చారు..!
, మంగళవారం, 12 జులై 2016 (16:41 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు.. ప్రేమించానన్నాడు.. తీరా కలుసుకునే సరికి అడ్డంగా బుక్కయ్యాడు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 17 ఏళ్ళ‌ అబ్బాయికి ఫేస్‌బుక్‌లో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి పేరు జిందా. ఈ ఇద్దరూ రాత్రి పగలు తేడా లేకుండా ఫేస్ బుక్ చాటింగ్‌లో మునిగిపోయేవారు.

దీంతో ఇద్దరి మధ్య విడదీయరాని సంబంధం ఏర్పడింది. సోమ‌వారం వారిద్ద‌రూ వ‌సంత్ కుంజ్ అనే ప్రాంతంలోని ఒక హోట‌ల్లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. కలుసుకునేటప్పుడు తనతో ఏకాంతంగా గడపాలని జిందా ఆ యువకుడిని కోరింది. అలాగే ఇద్దరూ హోటల్‌లో కలుసుకున్నారు. 
 
వీరిద్ద‌రూ ఏకాంతంగా గ‌డుపుతున్న స‌మ‌యంలో... ఏమైందో ఏమోగాని ఉన్నట్టుండి ఆమె పోలీసుల‌కు ఫోన్ చేసింది. త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డుతున్నాడుని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు... ఇద్దరు మైమరచి ఒకరి కౌగిలిలో మరొకరు బందీలుగా మారిన తరుణంలో అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. 
 
పోలీసుల విచారణలో... అ ఇద్ద‌రం ఏకాంతంగా గ‌డ‌పాల‌ని త‌నే ర‌మ్మంద‌ని, త‌ను వ‌ద్దంటున్నా ప‌దే ప‌దే ఇబ్బంది పెడితే కాద‌న‌లేక వ‌చ్చాన‌ని బాలుడు తెలిపాడు. పోలీసులు ఇద్ద‌రిపై కేసులు పెట్టారు. అమ్మాయిపైన పోస్కో చ‌ట్టం ప్ర‌కారం కేసు న‌మోదు కాగా. అబ్బాయిపై అత్యాచారం కింద కేసు న‌మోద‌య్యింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేతాజీ రష్యాలోనే రహస్యంగా గడిపేందుకు ఇష్టపడ్డారట..!