Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిండికేట్ స్కామ్ : సీబీఐ కోర్టు జడ్జికి ప్రేమ లేఖలు!

సిండికేట్ స్కామ్ : సీబీఐ కోర్టు జడ్జికి ప్రేమ లేఖలు!
, ఆదివారం, 17 ఆగస్టు 2014 (13:34 IST)
సిండికేట్ స్కామ్‌లోని నిందితులు ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తిని ప్రేమ (ప్రలోభ లేఖలు) లేఖలు రాసి మందలిపునకు గురయ్యారు. గత యూపీఏ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి కుంభకోణాల్లో సిండికేట్ బ్యాంకు స్కామ్ ఒకటి. తొలుత రూ.50 లక్షల ముడుపులేనన్న ఈ కేసులో తదనంతరం రూ.8 వేల కోట్ల మేర చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ స్కామ్‌పై ప్రస్తుతం సీబీఐ కూపీలాగుతోంది. అయితే ఈ కేసులో హఠాత్తుగా దిగ్భ్రాంతి కలిగించే అంశం వెలుగు చూసింది. కేసును విచారిస్తున్న మహిళా న్యాయమూర్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నిందితులు చేయని యత్నం లేదట. ఈ విషయాన్ని ఏ న్యాయవాదో, సీబీఐ అధికారో చెప్పారనుకోకండి. నిందితులు ఎవరికైతే లేఖలు రాశారో, వారే, ఆ మహిళా న్యాయమూర్తే వెల్లడించారు. 
 
‘మీ క్లెయింట్లకు కాస్త తిక్క ముదిరినట్టుంది. పద్దతిగా ఉండమని చెప్పండి. లేదంటే దీనిపైనా సీబీఐతో విచారణ చేయించడంతో పాటు వాతలు కూడా పెట్టించాల్సి వస్తుంది.’ అంటూ సిండికేట్ స్కాం కేసును విచారిస్తున్న మహిళా న్యాయమూర్తి స్వరణ కాంత శర్మ, నిందితుల తరపు న్యాయవాదిని హెచ్చరించారు. 
 
‘నాకు రాస్తున్న ప్రేమ లేఖలను నిలిపేయమని చెప్పండి. నాది బాగా స్థిరపడ్డ కుటుంబమే. ఈ తరహా కుయుక్తులు మానకపోతే, సీబీఐని రంగంలోకి దింపాల్సి వస్తుంది’ అంటూ శర్మ నిందితుల తరఫు న్యాయవాదికి తేల్చిచెప్పారు. ఇక్కడ ప్రేమ లేఖలంటేమీ రు మాకు అనుకూలంగా వ్యవహరిస్తే, ఫలానా పద్దతిలో ఫలానా బహుమానాలు ముట్టజెపుతామంటూ నిందితులు పదే, పదే ఆ జడ్జీకి లేఖలు రాశారట. దీంతో విసుగెత్తిపోయిన సదరు న్యాయమూర్తి ఇలా తన చుతురతతో వారికి కళ్లెం వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu