Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నన్ను వాడుకుని.. మరొకరిని పెళ్లాడాడు...

జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు తాల మరాండీ కొడుకు మున్నా మరాండీ తనను శారీరకంగా వాడుకుని, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఓ అమ్మాయి ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి, మున్నా రెండేళ్లకు పైగా తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడని గొడ్డా జిల్లా కోర్ట

నన్ను వాడుకుని.. మరొకరిని పెళ్లాడాడు...
, శుక్రవారం, 1 జులై 2016 (20:03 IST)
జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు తాల మరాండీ కొడుకు మున్నా మరాండీ తనను శారీరకంగా వాడుకుని, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఓ అమ్మాయి ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి, మున్నా రెండేళ్లకు పైగా తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడని గొడ్డా జిల్లా కోర్టులో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
 
మున్నా తనతో స్నేహంగా ఉండేవాడని, ఓ మొబైల్ ఫోన్‌ను కానుకగా ఇచ్చాడని ఆమె తెలిపింది. మున్నా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, మాట తప్పాడని ఆరోపించింది. జార్ఖండ్ మహిళా కమిషన్‌కు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. మున్నాకు నోటీసు జారీ చేస‍్తామని మహిళా కమిషన్ సభ‍్యులు తెలిపారు.
 
మున్నా గత మంగళవారం 11 ఏళ్ల మైనర్ అమ్మాయిని వివాహం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ పెళ్లి  రిసెప్షన్‌కు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ హాజరు కావాల్సి ఉన్నా రద్దు చేసుకున్నారు. మున్నా నిర్వాకంపై విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, అధికార బీజేపీ ఈ విషయంపై పెదవి విప్పలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మున్నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ నోరు అదుపులో పెట్టుకో... లేకుంటే... నారా లోకేష్‌