Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మృతి ఇరానీకి ఉద్యోగం ఇవ్వని జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ.. ఎందుకో తెలుసా?

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు విమానం క్యాబిన్‌ సిబ్బంది ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదట. మంచి శరీరాకృతి లేనందున ఈ ఉద్యోగానికి సరిపోదని

స్మృతి ఇరానీకి ఉద్యోగం ఇవ్వని జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ.. ఎందుకో తెలుసా?
, గురువారం, 25 ఆగస్టు 2016 (11:48 IST)
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు విమానం క్యాబిన్‌ సిబ్బంది ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదట. మంచి శరీరాకృతి లేనందున ఈ ఉద్యోగానికి సరిపోదని ఉద్యోగం ఇవ్వలేమని తిరస్కరించారట. ఈ విషయాన్ని ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏపీఏఐ) ఢిల్లీలో ఏర్పాటు చేసిన అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న స్మృతి గతంలో తనకు ఎదురైన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
 
ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. నేను కావాలనుకున్న ఉద్యోగాల్లో ఎయిర్‌వేస్‌లో ఉద్యోగం చేయడం ఒకటి. కానీ క్యాబిన్ క్రూ ఉద్యోగానికి వెళితే నన్ను తిరస్కరించారు. కానీ ఆ ఉద్యోగాన్ని తప్పించినందుకు ఇప్పుడు నేడు దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆ తర్వాతికాలంలో నేను మెక్ డొనాల్డ్స్‌లో పనిచేశా. ఆ తర్వాత మిగిలిన నా జీవితమంతా మీకు తెలిసిందేనని అప్పటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ఉద్యోగం వచ్చివుంటే తాను కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు. టీవీ నటిగా పేరు సంపాదించిన ఆమె తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కేంద్రమంత్రి అయిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ అభిమానిని చంపిన జూ.ఎన్టీఆర్ అభిమాని... కారణమేమిటంటే...