Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత సైన్యంలో తిరుగుబాటా? అబ్బే... అలాంటి ఛాన్సే లేదంటున్న ఇండియన్ ఆర్మీ అధికారులు

భారత సైన్యంలో తిరుగుబాటా? అబ్బే... అలాంటి ఛాన్సే లేదంటున్న ఇండియన్ ఆర్మీ అధికారులు
, ఆదివారం, 15 మే 2016 (16:03 IST)
భారత సైన్యంలో తిరుగుబాటు వచ్చిందా? అసలు ఇలాంటి పరిస్థితి ఇండియన్ ఆర్మీలో ఉత్పన్నమవుతుందని ఎవరైనా భావిస్తారా? కానీ, సైన్యంలో తిరుగుబాటు వచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులు ఆగమేఘాలపై స్పందించారు. తిరుగుబాటు వార్తలు అవాస్తమని, ఈ తరహా ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని పేర్కొన్నారు. 
 
ప్రతి నిత్యం జరిగే శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ జవాను గుండె పోటుతో మరణించడంతో భావోద్వేగానికి గురైన కొందరు సైనికులు ఆవేశపడినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లోని ఓ పదాతిదళంలో జవాన్లు శనివారం తిరుగుబాటు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఇదే అంశంపై భారత సైన్యం ఉన్నతాధికారులు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి నిత్యం జరిగే శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ జవాను గుండె పోటుతో మరణించడంతో భావోద్వేగానికి గురైన కొందరు సైనికులు ఆవేశపడినట్లు పేర్కొన్నారు. వారి ఆందోళన తీవ్ర స్థాయికి చేరడంతో జవాన్లు, అధికారుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగిందని, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని తెలిపారు. 
 
శనివారం రూట్ మార్చ్‌కు ముందు ఓ జవాను తనకు ఛాతీ నొప్పి వస్తోందని చెప్పారని, ఆ జవానును యూనిట్ వైద్యాధికారి పరీక్షించారని, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయనకు తగిన సామర్థ్యం ఉన్నట్లు వైద్యాధికారి ప్రకటించారన్నారు. ఆ తర్వాత ఆ జవాను కుప్పకూలిపోవడంతో యూనిట్ అంబులెన్స్‌కు తరలించినట్లు, అక్కడ ఆయన తుదిశ్వాస విడిచినట్లు వివరించారు. ఇదిలావుండగా భారత సైన్యం ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ బీజేపీలో లుక‌ల‌క‌లు... సోము వీర్రాజు వ‌ర్సెస్ వెంక‌య్య‌నాయుడు వ‌ర్గాలు