Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

14 సెకన్ల పాటు అమ్మాయిని తదేకంగా చూస్తే వేధించినట్టే.. కేసు పెడతాం : కేరళ ఐపీఎస్ రిషి రాజ్ సింగ్

ఎవరైనా సరే ఒక అమ్మాయిని 14 సెకన్ల పాటు తదేకంగా చూస్తే అలాంటి వారిపై కేసు పెడతామని కేరళ ఐపీఎస్ అధికారి, ఎక్సైజ్ కమిషనర్‌ రిషి‌రాజ్ సింగ్ అన్నారు.

14 సెకన్ల పాటు అమ్మాయిని తదేకంగా చూస్తే వేధించినట్టే.. కేసు పెడతాం : కేరళ ఐపీఎస్ రిషి రాజ్ సింగ్
, మంగళవారం, 16 ఆగస్టు 2016 (14:38 IST)
ఎవరైనా సరే ఒక అమ్మాయిని 14 సెకన్ల పాటు తదేకంగా చూస్తే అలాంటి వారిపై కేసు పెడతామని కేరళ ఐపీఎస్ అధికారి, ఎక్సైజ్ కమిషనర్‌ రిషి‌రాజ్ సింగ్ అన్నారు. కొచ్చిలో విద్యార్థులతో సమావేశమైన ఆయన ప్రసంగిస్తూ... ఎవరైనా వ్యక్తి యువతి వైపు 14 సెకన్లు చూస్తే, కేసు రిజిస్టర్ చేయవచ్చని, అమ్మాయిలు కత్తి లేదా పెప్పర్ స్ప్రేను తమ హ్యాండ్ బ్యాగుల్లో నిత్యమూ ఉంచుకోవాలని ఆయన చెప్పారు. 
 
ఈ వ్యాఖ్యలపై కేరళ రాష్ట్ర మంత్రులు తప్పుబడుతూ మండిపడుతున్నారు. వేధింపులకు కొత్త అర్థం చెప్పిన రిషిరాజ్ సింగ్ వ్యాఖ్యలు అసహ్యకరంగా ఉన్నాయని కేరళ క్రీడా శాఖ మంత్రి ఈపీ జయరాజన్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఎదుట ఆయన చేసిన పూర్తి ప్రసంగాన్ని పరిశీలించాలని ఎక్సైజ్ మంత్రిని కోరనున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌కు వెళ్లడమంటే నరకానికి వెల్లడమే : రక్షణ మంత్రి మనోహర్ పారీకర్