Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కులూమనాలీలో లిప్ట్ ఇస్తామంటూ ఇజ్రాయిల్ మహిళపై గ్యాంగ్ రేప్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులూమనాలీలో విదేశీ వనితలపై సామూహిక అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. 2012వ సంవత్సరంలో ఆస్ట్రేలియన్ యువతిపై కామాంధుడి అత్యాచారం చేయగా, 2013లో అమెరికన్ మహిళపై ముగ్గురు నేపాలీ య

కులూమనాలీలో లిప్ట్ ఇస్తామంటూ ఇజ్రాయిల్ మహిళపై గ్యాంగ్ రేప్
, సోమవారం, 25 జులై 2016 (10:35 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులూమనాలీలో విదేశీ వనితలపై సామూహిక అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. 2012వ సంవత్సరంలో ఆస్ట్రేలియన్ యువతిపై కామాంధుడి అత్యాచారం చేయగా, 2013లో అమెరికన్ మహిళపై ముగ్గురు నేపాలీ యువకుల గ్యాంగ్ రేప్‌కు గురయ్యారు. తాజాగా ఇజ్రాయిల్ మహిళపై ఇద్దరు సామూహిక అత్యాచారం జరిపిన సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
 
కులూమనాలీ అందాలను తిలకిద్దామని వచ్చిన విదేశీ వనితలపై కొందరు కామాంధులు అత్యాచారం చేశారు. లిప్ట్ ఇస్తామంటూ 25 ఏళ్ల ఇజ్రాయిల్ మహిళను కారు ఎక్కించుకున్న ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలీలో జరిగింది. స్పిటీ లోయలో కాజా ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన ఇజ్రాయిల్ మహిళ టాక్సీ కోసం ఎదురుచూస్తుండగా నెంబరు ప్లేటులేని ఓ కారు వచ్చింది. కారులో ఆరుగురున్నా ఇద్దరు యువకులు తనపై అత్యాచారం జరిపారని సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అత్యాచారానికి గురైన ఇజ్రాయిల్ మహిళను వైద్యపరీక్షలు చేయించి వైద్యుల సలహా కోసం మండీకి పంపించామని కులూ ఎస్పీ పాదం చంద్ చెప్పారు. కారుతోపాటు నిందితులను గుర్తించడంలో బాధితురాలు విఫలమయ్యారు. దీంతో తాము సీసీటీవీ ఫుటేజీ సాయంతో కేసు దర్యాప్తు చేస్తున్నామని, బాధితురాలి ఫిర్యాదును రిజిస్టరు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. అత్యాచార సంఘటన తెల్లవారు జామున జరిగినందున తాము నైట్ విజన్ కెమేరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఎస్పీ వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి : హత్యాచారమా?... ఆత్మహత్యా?