Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగళూరు చిన్నారిపై అత్యాచారం... వాడి కెమేరాల్లో బాలికలపై రేప్ దృశ్యాలు

బెంగళూరు చిన్నారిపై అత్యాచారం... వాడి కెమేరాల్లో బాలికలపై రేప్ దృశ్యాలు
, మంగళవారం, 22 జులై 2014 (20:34 IST)
బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరద్‌కర్‌పై కర్ణాటక ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. నగరంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరగడంపై నగరవ్యాప్తంగా ఆందోళనలు జరగడంతో ప్రభుత్వం కమిషనర్‌పై చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. భారతదేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో గత కొద్దికాలంగా మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. దీనిని అరికట్టడంలో పోలీసుశాఖ వైఫల్యం చెందిందని వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నూతన పోలీసు కమిషనర్‌గా ఏడీజీపీ ఎంఎన్ రెడ్డిని నియమించే అవకాశముంది.
 
ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు 
బెంగళూరులోని పాఠశాలలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల్లో ఒకరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ముస్తఫా అనే ఆ వ్యక్తి పాఠశాలలో స్కేటింగ్ శిక్షకునిగా పనిచేస్తున్నాడు. గతంలోనూ అతను మరో పాఠశాలలో ఇలాంటి నేరమే చేయగా యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించిందని పోలీసులు తెలిపారు. అతని ల్యాప్‌టాప్‌లోను, మొబైల్‌లోను పిల్లల మీద అత్యాచారాలు జరుపుతున్న వీడియోలు చూసి పోలీసులే నిర్ఘాంతపోయారు.
 
2011 నుంచి ప్రస్తుత పాఠశాలలో పని చేస్తున్న ముస్తఫాకి మూడేళ్ల కుమార్తె ఉంది. మరో నిందితుడి కోసం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో గత నాలుగు రోజులుగా నగరంలో తల్లిదండ్రులు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. పాఠశాలలు సైతం తమ నియమనిబంధనలను మరింత కట్టుదిట్టం చేశాయి. పిల్లల్ని బడిలో దింపి, తీసుకెళ్లేవారికి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం సంతకంతో కూడిన పాసులను ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu