Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరిహద్దుల్ని దాటడం అంటేనే యుద్ధం ప్రకటించడమేనా? కాశ్మీర్‌పై చైనా ఏమంటోంది?

ఉగ్రవాద స్థావరాలపై దాడులపై జమ్మూ-కాశ్మీరులోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ముస్తఫా కమల్ మాత్రం భిన్నంగా స్పందించారు. మన కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కాశ్మీర్‌ను శాంతి, స్నేహాలకు వారధిగా తీర్చిదిద్దాలన్నా

Advertiesment
Indian Army
, గురువారం, 29 సెప్టెంబరు 2016 (18:31 IST)
యూరీ ఘటన జరిగిన సమయంలో పాకిస్థాన్‌కు వంత పాడిన చైనా.. సర్జికల్‌స్ట్రైక్‌తో భారత ఆర్మీ రంగంలోకి దిగడంతో సీన్లోకి వచ్చింది. భారత్-పాకిస్థాన్‌ల మధ్య శాంతి శాంతి అంటూ చైనా క్లాజ్ తీసుకుంటుంది. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు వద్దని.. తగ్గించుకోండని చైనా సూచించింది.

ఉపఖండంలో శాంతికి ఇరు దేశాలు సహకరించాలని చైనా కోరింది. ఉగ్ర శిబిరాలపై భారత సైనిక దాడులకు సంబంధించి ఇరు దేశాలతో చైనా సంప్రదింపులు జరుపుతోంది. చైనాకు భారత్-పాక్ దేశాలు మిత్ర దేశాలని జఠిలమైన కాశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
మరోవైపు ఉగ్ర శిబిరాలపై భారత సైనిక దాడులపై పాక్ ఆర్మీ స్పందించింది. భారత్ తమను అకారణంగా నిందిస్తుందని.. ఆధారాలు లేకుండా పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు యూరీ ఘటనకు పాల్పడిందని ఆరోపణలకు దిగుతోందని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఆర్) డీజీ అసీమ్ సలీమ్ భజ్వా ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని.. అసీమ్ రాజ్‌గల్ పర్వత ప్రాంతాల నుంచి పాక్ ఆర్మీ ఉగ్రవాదులను ఏరివేసిందన్నారు. ఈ ప్రాంతంలో పాక్-ఆఫ్గన్ సరిహద్దు పూర్తిగా పాక్ ఆర్మీ నియంత్రణలో ఉన్నట్టు పేర్కొన్నారు. భారత్ తమను నిందించినా తాము మాత్రం ఎవ్వరినీ నిందించబోమని భజ్వా తెలిపారు. 
 
కాగా బుధవారం అర్థరాత్రి పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం అడుగుపెట్టి.. ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా 38మంది టెర్రరిస్టులను హతమార్చిన సంగతి తెలిసిందే. యూరీ సెక్టార్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసిన ఉగ్రవాద మూకలపై గట్టి ప్రతీకారం తీర్చుకున్నారు.

అయితే ఇలా సరిహద్దు దాటి భారత సైన్యం వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా భారత సైన్యంపై ప్రశంసలు, మద్దతు వెల్లువెత్తుతుంటే.. ఉగ్రవాద స్థావరాలపై దాడులపై జమ్మూ-కాశ్మీరులోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ముస్తఫా కమల్ మాత్రం భిన్నంగా స్పందించారు. 
 
మన కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కాశ్మీర్‌ను శాంతి, స్నేహాలకు వారధిగా తీర్చిదిద్దాలన్నారు. కానీ కేంద్రం దురదృష్టవశాత్తూ వేరే దారిలో నడుస్తోందని ఆరోపించారు. సరిహద్దులను దాటడమంటే యుద్ధం ప్రకటించడమేనని వ్యాఖ్యానించారు. దీంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సరిహద్దులు దాటడం ద్వారా పాకిస్థాన్‌కు యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చిందా అంటూ చర్చ సాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్‌తో యుద్ధానికి మోడీ మంత్రం.. భారత్ చేతిలో కాశ్మీర్ ఆపిల్... పాక్ ఏం చేస్తుంది?