Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఒక్క మాటతో కార్పొరేట్ ఆసుపత్రుల గుండె పగలగొట్టిన మోదీ

జాతీయ ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చి స్టెంట్లు, మందుల ధరలను నియంత్రించి గుండె ఆపరేషన్ ఖర్చును గణనీయంగా తగ్గించిన ప్రధాని మోదీ జనరిక్ మందులనే రోగులకు రాసేలా వైద్యరంగంలో మార్పులు తెస్తానని ప్రకటించి కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఒక్క ఉదుటున వణికించార

ఆ ఒక్క మాటతో కార్పొరేట్ ఆసుపత్రుల గుండె పగలగొట్టిన మోదీ
హైదరాబాద్ , మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (05:31 IST)
జాతీయ ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చి స్టెంట్లు, మందుల ధరలను నియంత్రించి గుండె ఆపరేషన్ ఖర్చును గణనీయంగా తగ్గించిన ప్రధాని మోదీ జనరిక్ మందులనే రోగులకు రాసేలా వైద్యరంగంలో మార్పులు తెస్తానని ప్రకటించి కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఒక్క ఉదుటున వణికించారు. గుజరాత్‌లోని సూరత్‌లో రూ.400 కోట్లతో నిర్మించిన కిరణ్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సోమవారం మోదీ ప్రారంభించారు. ‘పేదల ఆరోగ్యం మెరుగుపరిచే విషయంలో ధనికులు తమవంతు పాత్ర పోషించాలి. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌లోని చేతిరాత అర్థం కాక పేదలు ప్రైవేటు మెడికల్‌ దుకాణాల్లో వెళ్లి ఖరీదైన మందులు కొనాల్సి వస్తోంది. డాక్టర్లు తమ ప్రిస్క్రిప్షన్‌లో తప్పనిసరిగా జనరిక్‌ మందులే వాడాలని సూచించేలా నిబంధనలు తెస్తాం అని మోదీ అంటున్నప్పుడు ప్రజల హర్షధ్వానాలతో స్వాగతించారు.
 
 
మన దేశంలో వైద్యులు తక్కువ, ఆసుపత్రులు తక్కువ. కానీ మందుల ధరలు మాత్రం చాలా ఎక్కువ’ అని ప్రధాని అన్నారు. దేశవ్యాప్తంగా డాక్టర్లు.. ప్రజలకు జనరిక్‌ మందులు రాసేలా నిబంధనలు తెస్తామని చెప్పారు. బ్రాండెడ్‌ మందులతో పోలిస్తే తక్కువ ధరకే దొరికే జనరిక్‌ మందుల వినియోగం పెంచాలన్నారు. తమ ప్రభుత్వం 15 ఏళ్ల తర్వాత జాతీయ ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చి స్టెంట్లు, మందుల ధరలను నియంత్రిస్తే.. కొన్ని ఫార్మాకంపెనీలకు చాలా కోపం వచ్చిందన్నారు. దాదాపు 700 మందుల ధరలను పేదలకు అందుబాటులో ఉండేలా నియంత్రించినట్లు మోదీ గుర్తుచేశారు. తక్కువధరకే ప్రజలకు వైద్య సేవలందించటం ప్రభుత్వ బాధ్యత అని మోదీ తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలాగైతే పోలవరం గీలవరమే: తేల్చిచెప్పిన ఉన్నతాధికారులు.. కొట్టి పడేసిన బాబు..