Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగ్రమూకల్ని కట్టడి చేయాలంటూ మోడీ చురకలు.. యుద్ధ విమానాలు సరఫరా చేసే ఉద్దేశం లేదు

ఉగ్రమూకల్ని కట్టడి చేయాలంటూ పాకిస్థాన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చురకలంటించారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలన్నీ ఒకటి కావాలని మోడీ పిలుపునిచ్చారు. బ్రిక్స్ సమావేశాల రెండవ రోజు చర్చల్లో ప్రధానంగా

ఉగ్రమూకల్ని కట్టడి చేయాలంటూ మోడీ చురకలు.. యుద్ధ విమానాలు సరఫరా చేసే ఉద్దేశం లేదు
, ఆదివారం, 16 అక్టోబరు 2016 (17:17 IST)
ఉగ్రమూకల్ని కట్టడి చేయాలంటూ పాకిస్థాన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చురకలంటించారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలన్నీ ఒకటి కావాలని మోడీ పిలుపునిచ్చారు. బ్రిక్స్ సమావేశాల రెండవ రోజు చర్చల్లో ప్రధానంగా ఉగ్రవాదంపై చర్చించారు. ఉగ్రవాదన్ని ప్రొత్సహించే దేశాలపై అనుసరించే విధానంపై సభ్యదేశాలతో మోడీ చర్చించారు. ఇక పర్యావరణ పరిరక్షణపై బ్రిక్స్ దేశాలు నిర్ణయం తీసుకోనున్నాయి. 
 
బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో మోడీ భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ అధికారులు పాల్గొన్నారు. 
 
ఇదిలా ఉంటే.. దాయాది పాకిస్థాన్‌కు ఒక్క భారత్ నుంచే కాకుండా ప్రపంచదేశాల నుంచి కూడా దిమ్మదిరిగే షాకులొస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ జరిపిన సర్జిల్ దాడులతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాకిస్థాన్ ప్రపంచ మొత్తం మీద ఎక్కడా సపోర్టు దొరకట్లేదు. ప్రపంచదేశాలను తమతో కలుపుకునే పనిలో నిమగ్నమైన పాక్‌కు రష్యా సడన్ షాకిచ్చింది. 
 
తమ దేశం నుంచి పాకిస్థాన్ మిలిటరీ అవసరాలను తీర్చేలా హెలికాప్టర్లు రవాణా చేశామని, ఇకపై ఏ విధమైన విమానాలు, చాపర్లను అందించడం లేదని రష్యా కుండ బద్ధలు కొట్టింది. అసలు సరఫరా చేసే ఉద్ధేశం తమకు లేదని రష్యా స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తలిద్దరూ వేరే కాపురం పెట్టేశారు: పోలీస్ స్టేషన్‌లో భార్యల ఫిర్యాదు