Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌పై జలాస్త్రం... సింధు జలాల ఒప్పందం రద్దు దిశగా మోడీ సర్కారు

పాకిస్థాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుద్ధం ప్రకటించారు. బుల్లెట్ పేల్చకుండానే, ఎలాంటి రక్తపాతం లేకుండానే పాకిస్థాన్ పని ఖతం పట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం జలాస్త్రాన్ని ప్రయోగించనున్నారు. తద్వా

పాకిస్థాన్‌పై జలాస్త్రం... సింధు జలాల ఒప్పందం రద్దు దిశగా మోడీ సర్కారు
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (17:51 IST)
పాకిస్థాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుద్ధం ప్రకటించారు. బుల్లెట్ పేల్చకుండానే, ఎలాంటి రక్తపాతం లేకుండానే పాకిస్థాన్ పని ఖతం పట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం జలాస్త్రాన్ని ప్రయోగించనున్నారు. తద్వారా పాకిస్థాన్ మెడలు వంచాలని ఆయన భావిస్తున్నారు. 
 
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 56 యేళ్ల క్రితం కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా పాక్ 80 శాతం నీటిని వాడుకుంటోంది. ఒప్పందం రద్దు చేసుకుంటే పాకిస్థాన్‌కు ఈ అవకాశం ఉండదు. తద్వారా పాకిస్థాన్ ఎడారిలా మారుతుంది. 
 
సింధు జల ఒప్పందం ప్రకారం బియాస్, రావి, సట్లేజ్ నదులపై భారత్‌కు హక్కులున్నాయి. జమ్మూ కాశ్మీర్‌ నుంచి ప్రవహించే సింధు, చినాబ్, జీలం నదులపై పాకిస్థాన్‌కు కంట్రోల్ ఉంటుంది. అయితే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటేనే పాకిస్థాన్ దారిలోకి వస్తుందని మోదీ సర్కారు భావిస్తోంది. 
 
జమ్మూకాశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో ఉన్న ఆర్మీ స్థావరంపై పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి ఊతమిచ్చినంతకాలం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిందేనని భారత్ దృఢ సంకల్పంతో అడుగులు వేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ కళాకారులు 48 గంటల్లో భారత్ గడ్డ వీడాలి.. లేదంటే... : కర్మచారి సేన