Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#SurgicalStrike అంటే ఏమిటి..? పాకిస్థాన్‌ను గమనిస్తున్నాం.. భారత్‌కు సహకరిస్తాం.. అమెరికా

భారత్-పాకిస్థాన్‌ల మధ్య యూరీ ఘటనకు తర్వాత మాటల యుద్ధం జరుగుతోంది. బుధవారం పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినట్లు భారత సైనికాధికారి రణ్ బీర్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో.. భారత్‌పై పాక్ కాల్పుల ఉల్లంఘ

#SurgicalStrike అంటే ఏమిటి..? పాకిస్థాన్‌ను గమనిస్తున్నాం.. భారత్‌కు సహకరిస్తాం.. అమెరికా
, గురువారం, 29 సెప్టెంబరు 2016 (15:06 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య యూరీ ఘటనకు తర్వాత మాటల యుద్ధం జరుగుతోంది. బుధవారం పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినట్లు భారత సైనికాధికారి రణ్ బీర్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో.. భారత్‌పై పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడలేదని పాక్ తెలిపింది. సరిహద్దుల వద్ద కాల్పుల ఉల్లంఘన జరగనేలేదని నొక్కి చెప్పింది. అయితే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై బుధవారం రాత్రి సర్జికల్ స్ట్రయిక్స్ చేసినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ ప్రకటించారు. 
 
నిర్ణీత లక్ష్యాలపై చేసే దాడులుగా పేర్కొనే సర్జికల్ స్ట్రయిక్స్.. లక్ష్యాన్ని మాత్రమే దెబ్బతీసేలా ఉంటాయి. ముఖ్యంగా లక్ష్యాన్ని మాత్రమే ఎంచుకుని ఇతర ప్రాంతాలకు ఎలాంటి నష్టం కలగకుండా జరిగే దాడులనే సర్జికల్ స్ట్రయిక్స్‌గా పరిగణిస్తారని రణ్ బీర్ సింగ్ వివరించారు. లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతానికి సమీపంలో ఉండే ప్రజలకు, భవనాలు, వాహనాలకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా ఈ దాడులను నిర్వహించినట్లు ఆయన ప్రకటించారు. 
 
ఇటీవల ఆర్మీకి చెందిన 70 మంది కమాండోలు మయన్మార్ లో ఇటువంటి ఆపరేషనే నిర్వహించారు. 40 నిమిషాల్లో ఆపరేషన్ ముగించి 38 మంది నాగా వేర్పాటువాదులను హతం చేశారు. ఈ దాడిలో బాంబులను కూడా ఉపయోగిస్తారని రణ్ బీర్ సింగ్ వెల్లడించారు. మరోవైపు పాకిస్థాన్‌పై ఉక్కుపాదం మోపేందుకు ప్రపంచ దేశాలు సమాయత్తమవుతున్నాయి. టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన పాకిస్థాన్ పని తీరును గమనిస్తూనే ఉన్నామని తెలిపింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదంపై పోరాడుతున్న భారతదేశానికి సహకరిస్తామని అమెరికా ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ ఆక్రమిత కాశ్మీరుపై భారత్ దాడులు శభాష్... బెలూచిస్తాన్‌లో కూడా కుమ్మేయండి... మజ్దాక్ దిల్షాద్