పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

ఠాగూర్
సోమవారం, 8 డిశెంబరు 2025 (08:51 IST)
సాధారణంగా దొంగతనం చేసే వాళ్లను పట్టుకోవడం పోలీసుల విధి. కానీ, ఇక్కడ పోలీసులే దొంగలుగా మారిపోయారు. ఒక గుర్తు తెలియని శవం దర్యాప్తు కేసు నుంచి తప్పించుకునేందుకు ఈ పాడు పనికి పాల్పడ్డారు. చివరకు నిఘా నేత్రానికి చిక్కారు. క్లిష్టమైన కేసుల్లో దొంగలు, హంతకులను పట్టించే సీసీ కెమెరాలే ఇపుడు కూడా ఈ పోలీసు దొంగలను పట్టించి ఇచ్చాయి. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మీరట్‌ నగరంలోని శాస్త్రి నగర్ ఎల్-బ్లాక్ క్రాసింగ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 1:50 గంటల సమయంలో ఇద్దరు పోలీసులు ఒక ఈ-రిక్షాలో మృతదేహాన్ని తీసుకొచ్చి, ఓ దుకాణం ముందు పడేసి వెళ్లడం సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు లోహియా నగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
 
ఈ ఘటనపై మీరట్ ఎస్ఎస్పీ విపిన్ టాడా విచారణకు ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తులో నౌచాందీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్-బ్లాక్ అవుట్ పోస్ట్ ఇన్ఛార్జ్, సబ్-ఇన్‌స్పెక్టర్ జితేంద్ర కుమార్, కానిస్టేబుల్ రాజేశ్, హోంగార్డు రోహితాస్‌ను ఈ పని చేసినట్లు తేలింది. పోస్టుమార్టం వంటి అధికారిక ప్రక్రియల నుంచి తప్పించుకోవడానికే వారు ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎస్ఎస్పీ విపిన్ టాడా వెంటనే ఎస్సె జితేంద్ర, కానిస్టేబుల్ రాజేశ్‌ను సస్పెండ్ చేసి, హోంగార్డు రోహితాతాస్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తును ఎస్పీ (సిటీ) ఆయుష్ విక్రమ్ సింగ్‌కు అప్పగించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments