Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఊరంతా అల్లుళ్లే.. యూపీ గ్రామంలో సంప్రదాయం..!

ఊరంతా అల్లుళ్లే.. యూపీ గ్రామంలో సంప్రదాయం..!
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (14:55 IST)
భారత సంప్రదాయం ప్రకారం ఆడపిల్ల పుట్టిన తరువాత, పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. అయితే ఆ గ్రామంలో మాత్రం అమ్మాయికి వివాహం చేస్తే అల్లుళ్లే అక్కడి ఇల్లరికానికి రావాలి. అదివారి సంప్రదాయం. పెళ్లి అయిన తరువాత అల్లుళ్లే అన్ని సర్దుకుని నోరుమూసుకుని అత్తారింటిలో కాపురం చెయ్యాలి. అందుకు ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి నగరలోని కరాయ్ టౌన్ షిప్‌లో జరుగుతోంది. ఈ ప్రాంతంలో అందరూ ముస్లీంలే ఉంటారు. సుమారు 35 సంవత్సరాల క్రితం ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వీరు ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన ఆడపిల్లలకు కాన్పూర్, పతేపూర్, ప్రతాప్ గడ్, అలహాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన అబ్బాయిలతో వివాహం చేశారు. అప్పటి నుండి పెళ్లి చేసుకున్న మగాళ్లు వారి సొంత ఊర్లు వదిలి పెట్టి ఇక్కడికే వచ్చి ఇల్లరికం ఉంటున్నారని అక్కడ ఉన్న ‘హాజీ' అంటున్నారు. 
 
ఈ హాజీ కూడా అదే ప్రాంతంలో వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చిన వారేనట. తన కుమార్తెకు వివాహం చేశానని, ఆమె భర్త పిల్లలతో కలిసి మాదగ్గరే నివాసం ఉంటున్నది అంటున్నారు. ఈ ఆచారం చూసిన ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కౌశాంబి నగరం అనే పేరు మరిచిపోయారు. ఆ ప్రాంతానికి అల్లుళ్ల ప్రాంతం అని పిలుస్తున్నారు.

కాగా గ్రామంలో తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అత్తారింటి ఆరళ్ల సమస్య లేకపోవడంతో అమ్మాయిలూ సంతోషంగా ఉంటున్నారు. మొత్తానికి ఈ ప్రాంతంలో పుట్టే ఆడపిల్లలకు మెట్టినిల్లు ఉండదు.

Share this Story:

Follow Webdunia telugu