Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మందుబాబులు మద్యం సేవిస్తే ఒక కొబ్బరి కాయ జరిమానా

మద్యపానం వినియోగాన్నినిషేదించడానికి ప్రభుత్వం ఎన్నికఠిన చట్టాలని అమలులోకి తీసుకువచ్చిన మందుబాబుల ముందు అవేమి ఫలించడం లేదు. దీంతో మందుబాబుల ఆగడాలను అరికట్టడానికి చత్తీస్ గఢ్లోని కోర్బా జిల్లాలోగల ఓ గి

మందుబాబులు మద్యం సేవిస్తే ఒక కొబ్బరి కాయ జరిమానా
, గురువారం, 25 ఆగస్టు 2016 (12:13 IST)
మద్యపానం వినియోగాన్ని నిషేదించడానికి ప్రభుత్వం ఎన్నికఠిన చట్టాలని అమలులోకి తీసుకువచ్చిన మందుబాబుల ముందు అవేమి ఫలించడం లేదు. దీంతో మందుబాబుల ఆగడాలను అరికట్టడానికి ఛత్తీస్‌గఢ్లోని కోర్బా జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో మాత్రం ఓ వింత నిబంధనను ప్రవేశపెట్టారు. ఎవరైనా మద్యం నిషేధాన్ని అతిక్రమించి మద్యం సేవిస్తే వారు ఒక కొబ్బరి కాయ జరిమానాగా తిరిగి చెల్లించాలంట. 
 
మైంగాడి అనే గ్రామంలో చిన్నారుల నుంచి పెద్దలవరకు పలువురు మద్యానికి బానిసలయ్యారంట.  మద్యాన్ని తాగుతున్న వారు ఉదయం నుంచి రాత్రి వరకు మత్తులో తూలుతున్నారు. వారితో మద్యం మాన్పించేందుకు ఆలోచన చేసిన పంచాయతీ సర్పంచ్ శనిచరణ్ మింజ్ ఈ రకమైన నిబంధనను అమలు చేశారు. ఇక నుంచి మద్యం తాగుతూ పట్టుబడిన వారు కొబ్బరికాయను జరిమానాగా చెల్లించాలని ఆదేశించారు. అయితే, కొబ్బరికాయ సమర్పించుకోవడమంటే ఏదో పంచాయతీకి ఇచ్చి ఇచ్చుకోవడం కాదు. అందరూ ఉండగా బహిరంగంగా దానిని తీసుకొచ్చి పంచాయతీ పెద్ద చేతిలో పెట్టాలంట. 
 
ఇలాచేయడం ద్వారా నలుగురి ముందు వారికి అవమానంగా అనిపించి మందు మానేస్తారని ఆ ఊరి సర్పంచ్ ఆలోచన. కానీ ఇలా పలుమార్లు పట్టుబడితే మాత్రం పోలీసులకు అప్పగిస్తామని హెచ్చరించారు. నిజానికి ఈ గ్రామంలో విద్యుత్ లేకపోవడంతో వారంతా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ మద్యం సేవిస్తారని ఆ సర్పంచ్ వెల్లడించారు. ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా వారు మారకపోవడం వల్లే తాజాగా ఈ నిబంధన తెచ్చినట్లు ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ గ్రామాల యువకుల పెళ్లి ఆశలపై నీళ్లు చల్లుతున్న గంగానది వరదలు.. ఎలా?