Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేకి: గడ్కారీకి ఘాటైన వ్యాఖ్యలతో సోనియా లేఖ!

ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేకి: గడ్కారీకి ఘాటైన వ్యాఖ్యలతో సోనియా లేఖ!
, శుక్రవారం, 27 మార్చి 2015 (15:44 IST)
ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. అంతేగాకుండా ఎన్డీయే సర్కారు రైతు హక్కులను కాలరాసి పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం పొందేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 
 
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి ఘాటైన వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపాదించిన భూ సేకరణ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న తమ పార్టీ... రైతు వ్యతిరేకి, జాతి వ్యతిరేకి అంటూ చేస్తున్న ఆరోపణలను సోనియా లేఖలో ఖండించారు. 
 
కాగా భూ సేకరణకు సంబంధించి తీసుకొచ్చిన వివాదస్పద చట్టంపై ఏకాభిప్రాయం సాధించేందుకు బీజేపీ నేతలు చర్చకు ఆహ్వానించడం సంప్రదాయాన్ని అపహాస్యం చేసినట్టేనన్నారు. ఈ బిల్లులో కేంద్రం చేయబోతున్న సవరణలను కాంగ్రెస్ ఆమోదించదని సోనియా స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu