Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోల్‌కత్తా: ప్రధానిగా మోడీని చూడాలనుకుంటున్న.. గురువు ఆత్మస్థానంద్..!

కోల్‌కత్తా: ప్రధానిగా మోడీని చూడాలనుకుంటున్న.. గురువు ఆత్మస్థానంద్..!
, సోమవారం, 4 మే 2015 (14:40 IST)
వచ్చే శనివారం ప్రధాని మోడీ కోల్‌కత్తాలో ఒకరోజు పర్యటించనున్నారు. బేలూరులోని రామకృష్ణ మఠానికి పెద్దగా ఉన్న 97 ఏళ్ల ఆత్మస్థానంద్ మహారాజ్ గత కొద్దికాలంగా ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతున్న ఆయన్ని ప్రధాని మోడీ కలవనున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన గురువు బేలూరులోని రామకృష్ణ మఠానికి పెద్దగా ఉన్న ఆత్మస్థానంద్ మహారాజ్ ఓ లేఖ రాశారు.
 
గత కొంతకాలంగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మోడీకి ఓ లేఖ రాశారు. చివరిసారిగా మోడీ తన గురువును 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలుసుకున్నారు. అనంతరం ప్రధాని అయ్యాక తమ ఆశ్రమానికి రావాల్సిందిగా బేలూర్ మఠం నుంచి మోదీకి లేఖ పంపించారు. యవ్వనంలో నాడు సన్యాసిగా చేరేందుకు వచ్చిన నువ్వు నేడు ప్రధానిగా మఠంలోకి వస్తుంటే చూడాలని ఉంది అని ఆయన లేఖలో రాశారు. 
 
అయితే, గత కొంతకాలంగా తీరిక లేకుండా ఉన్న మోదీ ప్రస్తుతం కాస్త విరామం తీసుకుని శనివారం బేలూరు మఠానికి వెళ్లనున్నారు. దీనిపై మఠానికి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ సుబీర్నందా మహారాజ్ మాట్లాడుతూ 'మోడీగారూ ఆత్మస్థానంద్ మహారాజ్ను గురువుగారిగా భావిస్తారు. ఎప్పటి నుంచో ఆయనను కలుసుకోవాలనుకుంటున్నారు. గతకొంతకాలంగా ఆస్పత్రిలో ఉంటున్నారు. రాజ్‌కోట్లో కలిసి ఉన్నప్పుడు ఆత్మస్థానంద్ మహారాజ్గారి సలహాలు మోడీ తీసుకునేవారు' అని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu