Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చర్లపల్లి జైలు గోడలు బద్దలుకొట్టి బయటకొస్తా.. భార్యకు ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఫోన్

చర్లపల్లి జైలు గోడలు బద్దలుకొట్టి బయటకొస్తా.. భార్యకు ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఫోన్
, శనివారం, 4 జులై 2015 (10:20 IST)
త్వరలోనే మనమిద్దరం కలుసుకోబోతున్నాం.. చర్లపల్లి జైలు గోడలు బద్దలుకొట్టి బయటకు వస్తానని ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ తన భార్య జాహిదాకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు చర్లపల్లి జైలు వద్ద గట్టిబందోబస్తును ఏర్పాటుచేశారు. 
 
జైళ్ళలోని ఖైదీలు తమ కుటుంబసభ్యులతో మాట్లాడుకునేందుకు టెలిఫోన్ కాయిన్ బాక్సులను ఏర్పాటుచేశారు. వీటిని ఉగ్రవాది యాసిన్ తనకు అనుకూలంగా సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఫోన్ బాక్సుల నుంచి ఢిల్లీలో ఉన్న తన భార్య, తన కుటుంబసభ్యులు, సన్నిహితులకు పలు మార్లు ఫోన్ చేశాడు. దీనిపై నిఘా వేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లు యాసిన్ భత్కల్ టెలిఫోన్ సంభాషణలను రికార్డు చేశాయి. 
 
తాను జైలు నుంచి పారిపోయి వస్తున్నానని, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సన్నిహితులకు పలుమార్లు భత్కల్ ఫోన్లు చేసినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఉన్న తన భార్య జాహిదాతో సైతం భత్కల్ మాట్లాడుతూ.. త్వరలోనే మనం కలుసుకుంటామని యాసిన్ చెప్పాడని తెలిపాయి. ఇదేవిషయాన్ని కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలకూ ఎన్ఐఏ సమాచారం ఇచ్చింది. దీంతో చర్లపల్లి జైల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu