Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హేమ మాలినికి స్టార్ ట్రీట్మెంట్... మాకు మాత్రం... కారు ప్రమాదం బాధితులు

హేమ మాలినికి స్టార్ ట్రీట్మెంట్... మాకు మాత్రం... కారు ప్రమాదం బాధితులు
, శుక్రవారం, 3 జులై 2015 (17:45 IST)
కారు ప్రమాదంలో తమ చిన్నారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో తీవ్ర గాయాలతో ఉన్న తమకు నాసిరకమైన చికిత్స అందిస్తున్నారనీ, ఐతే హేమ మాలినికి మాత్రం స్టార్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటూ కారు ప్రమాదంలో గాయపడ్డ బాధితులు వాపోతున్నారు. ఆరోజు రాత్రి తామంతా తమ చిన్నారి సోనమ్, ఇంకా కుటుంబ సభ్యులతో వెళ్తుంటే ఎంతో వేగంగా హేమ మాలిని కారు వచ్చి ఢీకొట్టిందన్నారు. 
 
ఐతే ప్రమాదంలో గాయపడిన హేమ మాలినిని హుటాహుటిన ఘటన జరిగిన ప్రాంతానికి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్పించారనీ, తమను మాత్రం సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించారనీ, అక్కడ తమకు సరైన చికిత్స అందటం లేదని వాపోతున్నారు. 
 
ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి సోనమ్ మృత్యువాత పడింది. ఆమె తండ్రి ఖండెల్వాల్, తల్లి షికతోపాటు సోదరుడు సోమిల్, అత్త సీమ తీవ్ర గాయాలతో బయటపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu