Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెడ్ మాస్టర్ దారి తప్పాడు.. మహిళా టీచర్లు టాయిలెట్‌కు వెళితే.. గోడ సందుల్లో నుంచి?

విద్యార్థులను సరైన దారిలో పెట్టాల్సిన ఓ హెడ్ మాస్టర్ దారి తప్పాడు. ప్రధానోపాధ్యాయుడి హోదాలో ఉండి మహిళా టీచర్లు టాయిలెట్‌కు వెళ్లగా గోడ సందుల్లో నుంచి ఫొటోలు తీస్తూ వచ్చాడు. చివరికి విషయం బయటకు పొక్కడం

హెడ్ మాస్టర్ దారి తప్పాడు.. మహిళా టీచర్లు టాయిలెట్‌కు వెళితే.. గోడ సందుల్లో నుంచి?
, బుధవారం, 31 ఆగస్టు 2016 (11:56 IST)
విద్యార్థులను సరైన దారిలో పెట్టాల్సిన ఓ హెడ్ మాస్టర్ దారి తప్పాడు. ప్రధానోపాధ్యాయుడి హోదాలో ఉండి మహిళా టీచర్లు టాయిలెట్‌కు వెళ్లగా గోడ సందుల్లో నుంచి ఫొటోలు తీస్తూ వచ్చాడు. చివరికి విషయం బయటకు పొక్కడంతో ఊచలు లెక్కపెడుతున్నాడు. సభ్యసమాజమే తలదించుకునే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఆ వివరాలను పరిశీలిస్తే.... కనౌజ్ సమీపంలోని సౌరిక్ అనే గ్రామంలో ప్రభుత్వ జూనియర్ హై స్కూల్ ఉంది.
 
ఆ స్కూల్లో విధులు నిర్వహించే ఇద్దరు మహిళా టీచర్లు టాయిలెట్‌కు వెళ్లారు. హఠాత్తుగా డోరు చప్పుడు కావడంతోపాటు ఎవరో వచ్చినట్లు అనిపించింది. ఎవరో ఫొటోలు తీస్తున్నట్టు అనిపించడంతో వెంటనే బయటికి వచ్చి చూశారు. పాఠశాలలో ఆడుకుంటున్న పిల్లలను ఈ విషయమై ప్రశ్నించగా, హెడ్మాస్టర్ తన ఫొన్‌లో ఫొటోలు తీశారంటూ అసలు విషయం చెప్పారు. దీంతో ఆ హెడ్మాస్టర్‌ను నిలదీయగా, తనపైనే నిందలు వేస్తారా అంటూ బిగ్గరగా అరుస్తూ... మీపై చర్యలు తీసుకుంటానంటూ బెదిరించాడు. జరిగిన విషయాన్ని ఆ టీచర్లు ఇంట్లో వాళ్లకు చెప్పడంతో వారు డిస్ట్రిక్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. 
 
ఈ విషయమై విచారణ చేపట్టాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. టీచర్లపై ప్రధానోపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన విషయమై స్కూల్లోని పిల్లలు, ఇతర టీచర్లు, గ్రామ పెద్ద నుంచి సమాచారం సేకరించిన వారు ఆ నివేదికను మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. దీంతో ఆ హెడ్ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం సేవించి యుపతి పట్ల అసభ్య ప్రవర్తన... వెదురుకర్రలతో దేహశుద్ధి