Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ డాక్టర్‌పై కాల్పులు జరిపింది నేను కాదు.. సూసైడ్ చేసుకున్న డాక్టర్ శివకుమార్

ఆ డాక్టర్‌పై కాల్పులు జరిపింది నేను కాదు.. సూసైడ్ చేసుకున్న డాక్టర్ శివకుమార్
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (10:51 IST)
హైదరాబాద్, మొయినాబాద్‌ మండలం నక్కపల్లిలో తుపాకీతో కాల్చుకుని డాక్టర్‌ శశికుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయ్‌ అనే డాక్టర్‌పై శశికుమార్ కాల్పులకు తెగబడిన విషయంతెల్సిందే. శశికుమార్‌ కోసం గాలిస్తున్న పోలీసులకు నక్కలపల్లి నిషి ఫాంహౌస్‌లో అతడు శవమై కన్పించారు. లైసెన్స్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డా.శశికుమార్‌ సూసైడ్‌నోట్‌ రాశారు. 
 
డాక్టర్లు చైతన్య, కేవీరెడ్డి తనకు రూ.1.30 కోట్లు ఇవ్వాల్సి ఉందని, డాక్టర్‌ ఉదయ్‌పై కాల్పులు జరిపింది తాను కాదని డాక్టర్‌ శశికుమార్‌ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఆస్పత్రికి సంబంధించి ఆర్థిక లావాదేవీలే గొడవకు కారణమని పేర్కొన్నాడు. 
 
వివరాల్లోకి వెళితే మాదాపూర్‌కు చెందిన గ్లోరియల్ హాస్పిటల్ డాక్టర్లు హిమాయత్‌ నగర్‌లోని స్ట్రీట్ నెం 6లో ఉన్న రాజా రెసిడెన్సీలో సమావేశం అయ్యారు. ఆస్పత్రికి సంబంధించిన లావాదేవీలకు వీరి మధ్య వివాదం చోటుచేసుకుంది. సమావేశం ముగిసిన తర్వాత ముగ్గురూ కలిసి మాదాపూర్ నుంచి కారులో బయలుదేరారు. హిమాయత్ నగర్ వద్దకు చేరుకున్న తర్వాత హఠాత్తుగా డాక్టర్ శశికుమార్.. డాక్టర్ ఉదయ్‌పై కాల్పులు జరిపాడు.
 
దీంతో బుల్లెట్ శబ్దాలకు భయభ్రాంతులైన స్థానికులు అటుఇటు పరుగులు తీశారు. గాయపడిన వైద్యుడిని హైదర్ గూడాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఉదయ్ పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. కాల్పుల ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. రాజా రెసిడెన్సీలో జరిగిన డైరెక్టర్ల సమావేశంలో తుపాకులను అనుతించించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
తమ వెంట తుపాకులను తీసుకెళ్లారంటే ఉద్దేశపూర్వకంగా ఒకరిపై మరొకరు కాల్పులకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. హాస్పిటల్‌లో పెట్టుబడులు, నిర్వహణ విషయంలో తలెత్తిన విబేధాలే కాల్పులకు కారణమని, డైరెక్టర్ల సమావేశానికి వెళ్లేటప్పుడే డాక్టర్లలో ఒకరు ఆయుధం కలిగి ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

కాగా హిమాయత్‌నగర్‌లో ఉదయ్‌కుమార్‌పై కాల్పులకు తెగబడ్డ శశికుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. శశికుమార్‌ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌లో అతని మృతదేహాన్ని గుర్తించారు. శశికుమార్‌ రివాల్వర్‌తో కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu