Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నల్లగా ఉన్నాడంటూ భర్తనే చంపేసింది... జైలుకెళ్లింది..!

నల్లగా ఉన్నాడంటూ భర్తనే చంపేసింది... జైలుకెళ్లింది..!
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (16:13 IST)
నల్లగా ఉన్నాడంటూ భర్తను ఓ భార్య చంపేసింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో సుందరానా గ్రామానికి చెందిన ఫర్జానాబానోకు ఫారూఖ్‌(22)తో రెండేళ్ల కిందట వివాహమైంది. ఫారూఖ్‌ నల్లగా ఉండటంతో ఫర్జానా అతనితో సఖ్యతగా ఉండకపోవడంతో పాటు తరచూ భార్యభర్తలిద్దరూ గొడవ పడుతుండేవారు. 
 
భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన ఫర్జానా 10 రోజుల కిందట తిరిగి అత్తవారింటికి వచ్చింది. మళ్లీ బుధవారం రాత్రి భార్యాభర్తలిద్దరూ గొడవపడగా, ఫారూఖ్‌ ఫర్జానాపై చేయిచేసుకున్నాడు. దీంతో ఫర్జానా గురువారం సాయంత్రం ఫారూఖ్‌ తలపై సుత్తితో కొట్టి హతమార్చింది. పోలీసులు కేసు నమోదుచేసుకొని ఫర్జానాను అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu