Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజస్థాన్‌లో గుజ్జర్ల ఆందోళన : 100 రైళ్ళను ఆపేశారు!

రాజస్థాన్‌లో గుజ్జర్ల ఆందోళన : 100 రైళ్ళను ఆపేశారు!
, శుక్రవారం, 22 మే 2015 (19:08 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో గుజ్జర్లు విభిన్నరీతిలో ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కల్పిస్తున్న ఒక్కశాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచాలని కోరుతూ వారు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా గురువారం ఢిల్లీ - ముంబై రైలు మార్గంలో ఆరు రైళ్లను నిలిపివేశారు. దీంతో కేంద్ర రైల్వేశాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంతో అప్రమత్తమైన గుజ్జర్లు రాజస్థాన్ గుండా ప్రయాణించే రైలు మార్గాలను దిగ్భందించారు. దీంతో సుమారు వంద రైళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా ఉత్తరభారతంలో రైళ్ళ రాకపోకలు స్తంభించిపోయాయి. 
 
రాజస్థాన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి, చర్చలకు రావాలని ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న గుజ్జర్ అర్కషాన్ సంఘర్ష్ సమితి నేతలకు లేఖలు పంపింది. లేఖలు, చర్చలతో ఉపయోగం లేదని, తక్షణం 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని, లేని పక్షంలో ఆందోళన ఆపేది లేదని ఆందోళన కారులు స్పష్టం చేస్తున్నారు. కాగా, ఏడేళ్ల క్రిందట కూడా గుజ్జర్లు ఇదే రీతిన ఆందోళన నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వారితో చర్చలు జరిపి, ఆందోళనలు ఆపింది.

Share this Story:

Follow Webdunia telugu