Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నల్లగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన గుజరాత్ మహిళ!

నల్లగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన గుజరాత్ మహిళ!
, శనివారం, 25 ఏప్రియల్ 2015 (15:19 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్త నల్లగా ఉన్నాడనీ అతనిని కడతేర్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కిరాతక చర్య వివరాలను పరిశీలిస్తే... గుజరాత్‌కు చెందిన ఫర్జానా (22) అనే మహిళ ఫరూక్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈయన పుట్టుకతోనే నలుపు. నల్లగా ఉన్నాడన్న కారణంతో అతనంటే అయిష్టత కనబర్చే ఫర్జానా చివరికి హత్యకు తెగించింది. 
 
అయితే కుటుంబ ఒత్తిళ్ల కారణంగా రెండేళ్ల క్రితం ఫర్జానా వివాహం చేసుకుంది. ఆతర్వాత ఆమె ఎక్కువగా పుట్టింట్లోనే ఉంటూవచ్చింది. నల్లగా ఉన్నాడని భర్తను దగ్గరకు రానిచ్చేది కాదు. ఈ నేపథ్యంలో పది రోజుల కిందటే ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది. 
 
ఇంతలోనే తన కోర్కెను తీర్చమని భర్త ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించింది. దీంతో మాటామాటా పెరిగింది. భర్త తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో చేతికి అందిన సుత్తి తీసుకుని భర్త ఫరూక్‌‌పై దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో అతగాడు అక్కడిక్కడే చనిపోయాడు. 
 
మరుసటి రోజు ఉదయాన్నే కుటుంబ సభ్యులు ఫరూక్ కోసం వెదకడం మొదలుపెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పెట్లాద్ పోలీసులకు భార్య ఫర్జానా తీరు సందేహాలకు తావిచ్చింది. తొలుత బుకాయించిన ఆమె పోలీసుల లై డిటెక్టర్ పరీక్ష చేస్తామని చెప్పడంతో నేరం అంగీకరించింది. దీంతో, ఐపీసీ సెక్షన్ 302 కింద ఆమెపై కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu