Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'నీగ్రో' అని గబుక్కున అన్నాను.. అయాం సారీ... గోవా సీఎం క్షమాపణ

'నీగ్రో' అని గబుక్కున అన్నాను.. అయాం సారీ... గోవా సీఎం క్షమాపణ
, శుక్రవారం, 22 ఆగస్టు 2014 (12:15 IST)
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తాను 'నీగ్రో' అనే పదాన్ని ఉపయోగించినందుకు అసెంబ్లీలో సారీ అని చెప్పారు. ఆఫ్రికన్ జాతీయులను 'నీగ్రో' అని పిలవడం అమర్యాదకరమనీ, ఐతే 'బ్లాక్స్' అనాల్సింది పోయి పొరబాటున నీగ్రో అని అన్నందుకు సారీ చెప్పారు. గోవా ముఖ్యమంత్రి గోవా అసెంబ్లీలో గోవా ప్రభుత్వం అదుపులో వున్న విదేశీయుల గురించి వివరిస్తూ, ఓ గుర్తు తెలియని ఆఫ్రికన్ నీగ్రో వ్యక్తిని కలాంగుటే గ్రామం వద్ద అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. 
 
నీగ్రో అన్న పదం జాతి వివక్ష కిందికి వస్తుందని మండిపడ్డాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దీనిపై స్పందిస్తూ... ఇలాంటి పదాల వాడకంతో విదేశీ యాత్రికులకు ప్రతికూల సందేశాలు వెళతాయంది. దీనిపై సీఎం పారికర్ వివరణ ఇస్తూ.. ఇది పోలీస్ డిపార్ట్‌మెంటు తప్పిదమని, ఆ విభాగంలోని ఓ క్లర్కు సదరు ఫైల్లో నీగ్రో అని పేర్కొన్నాడని తెలిపారు. 
 
నీగ్రో పేరిట అమెజాన్ ప్రాంతంలో ఓ ఉపనది ఉందని, మరో అర్థంలో చూసుకుంటే జాతి వివక్ష భావం కనిపిస్తుందని వివరించారు. తాను ఆ పదం వాడడం పట్ల ఎవరైనా బాధపడి ఉంటే అందుకు క్షమాపణలు తెలుపుతున్నానన్నారు.

Share this Story:

Follow Webdunia telugu