Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాలిటెక్నిక్ అమ్మాయి.. కాస్మాటిక్స్ షాప్ మహిళను ప్రేమించింది.. ఆ తర్వాత వారిద్దరేంచేశారు?

పలు విదేశాల్లో స్వలింగ సంపర్క వివాహాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ తరహా సంస్కృతి భారత్‌కు వ్యాపించింది. పాలిటెక్నిక్ కోర్సు ఫైనల్ ఇయర్ చదివే అమ్మాయి ఒకరు బ్యూటీ పార్లర్‌కు వెళుతూ కాస్మాటిక్ షాపు యజమానురా

పాలిటెక్నిక్ అమ్మాయి.. కాస్మాటిక్స్ షాప్ మహిళను ప్రేమించింది.. ఆ తర్వాత వారిద్దరేంచేశారు?
, మంగళవారం, 28 జూన్ 2016 (08:43 IST)
విదేశాల్లో స్వలింగ సంపర్క వివాహాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ తరహా సంస్కృతి భారత్‌కు వ్యాపించింది. పాలిటెక్నిక్ కోర్సు ఫైనల్ ఇయర్ చదివే అమ్మాయి ఒకరు బ్యూటీ పార్లర్‌కు వెళుతూ కాస్మాటిక్ షాపు యజమానురాలు (మహిళ)ను ఇష్టపడింది. ఆ తర్వాత వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో వారిద్దరు పారిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో గత జనవరి నెలలో జరిగింది. ఈ పారిపోయిన 'గే' ప్రేమికుల ఆచూకీ ఇప్పటికీ తెలుసుకోగలిగారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఆగ్రాలోని ఓ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో వృత్తివిద్యా కోర్సు ఫైనల్ ఇయర్ చదివే ఓ విద్యార్థిని... స్థానికంగా బ్యూటీపార్లర్ నడుపుతున్న 25 ఏళ్ల మహిళను ప్రేమించింది. ఆ ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పి ఆమెను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులను అడిగింది. దీనికి వారు అంగీకరించకపోవడంతో జనవరి 4న ఇంటి నుంచి పారిపోయింది. దీనిపై ఆ విద్యార్థిని తండ్రి జనవరి 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అయితే, వారి కోసం నాటి నుంచి నేటి వరకు గాలిస్తూ వచ్చారు. చివరకు వారి మొబైల్ ఫోన్ ఆధారంగా ఆగ్రాకు సమీపంలోని దెవ్రి అనే గ్రామంలో వారిద్దరు ఉన్నట్టు గుర్తించారు. అదీ ఎలాగంటే.. వాళ్లిద్దరు కొంతకాలం సహజీవనం చేసి పెళ్లి చేసుకుని కలిసి జీవిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పైగా ఆ విద్యార్థిని మేజర్ కావడంతో పోలీసులు కూడా ఏం చేయలేక చేతులెత్తేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రకాశం జిల్లా దొనకొండలో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్క్... రూ.43 వేల కోట్ల భారీ ప్రాజెక్టు