Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోషల్ మీడియాలో అరిహంత్‌ను వేధించిన మహిళ!

సోషల్ మీడియాలో అరిహంత్‌ను వేధించిన మహిళ!
, బుధవారం, 22 అక్టోబరు 2014 (20:09 IST)
సోషల్ మీడియాలో మహిళలు కూడా వేధింపులకు గురైన సంగతి తెలిసిందే. మొన్న జగన్ సోదరి షర్మిళ, నిన్న అరకు ఎంపీ కొత్తపల్లి గీత సామాజిక మీడియాలో సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా మహిళలు సామాజిక మీడియాలో వేధింపులకు దిగుతున్నారు. వ్యాపారవేత్త అరిహంత్‌ను  మహిళ వేధింపులకు గురిచేసింది. అరిహంత్ 27 ఏళ్ల పురుషుడు. పురుషులు మహిళల ద్వారా వేధింపులకు గురవడం మొదలైందని అహ్మదాబాద్ సైబర్ క్రైం విభాగం పోలీసులు చెబుతున్నారు.
 
మూడేళ్ల క్రితం సోషల్ మీడియాలో ప్రవేశించిన ప్రియాంక అనే సదరు మహిళ, తాను అందంగా లేకున్నా, ఆకర్షణీయంగా ఉన్న మరో మహిళ ఫొటోతో అరిహంత్‌ను ఆకట్టుకుంది. ఏడాదిన్నరగా ఇద్దరు చాటింగ్‌లో కబుర్లు చెప్పుకున్నారు. తీరా ముఖాముఖిగా కలిసిన అరిహంత్, ప్రియాంక అసలు రూపాన్ని చూసి కంగుతిన్నాడు. ఆ తర్వాత అతడు ఆమెకు క్రమంగా దూరం జరిగేందుకు యత్నించాడు. 
 
ఈ క్రమంలో అరిహంత్ సెల్ నెంబర్‌తో పాటు, అతడి తల్లి ఫోన్ నెంబర్‌ను కూడా సంపాదించిన ప్రియాంక రెండేళ్లుగా వారిని వేధింపులకు గురి చేస్తోంది. దీంతో, ఆమె వేధింపులకు వేగలేక అరిహంత్ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదన్నమాట సంగతి..!

Share this Story:

Follow Webdunia telugu