Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో జనాభా నియంత్రణకు మాస్ స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టాలి: గిరిరాజ్

బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ తర్వాత దేశంలో జనాభా నియంత్రణకు మాస్ స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టాలని మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సహాయమ

దేశంలో జనాభా నియంత్రణకు మాస్ స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టాలి: గిరిరాజ్
, సోమవారం, 5 డిశెంబరు 2016 (12:26 IST)
బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ తర్వాత దేశంలో జనాభా నియంత్రణకు మాస్ స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టాలని మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సహాయమంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపు నివ్వడం కలకలం రేపింది. దేశంలో స్టెరిలైజేషన్ కోసం చట్టాలను చేయాల్సిన అవసరం ఉందని గిరిరాజ్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్, మలేషియాలో ఇలాంటి జనాభా నియంత్రణ చట్టాలు ఉన్నాయన్నారు. కనుక ఇలాంటి చట్టాలు భారతదేశంలో కూడా ఉంటే తప్పేమీ లేదని పేర్కొన్నారు. 
 
తన పార్లమెంటరీ నియోజకవర్గం నవాడా జరిగిన ఒక కార్యక్రమంలో సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జనాభాను నియంత్రించడానికి స్టెరిలైజేషన్‌కు పిలుపునిచ్చారు. నోట్ బందీ తర్వాత నస్ బందీ కార్యక్రమం చేపట్టాలన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను బీజీపీ కొట్టివేసింది. ఇది ఆయన వ్యక్తి గత అభిప్రాయమనీ, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం ఏదీ లేదని రాహుల్ సిన్హా వివరణ ఇచ్చారు. 
 
దేశంలో జనాభా పెరుగుతోంది , ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ అలాంటి ఎజెండా ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే జనాభా నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు రావాలన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలితకు ఆగిన గుండె.. ఈసీఎంవో ద్వారా ఆక్సిజన్ సరఫరా? ఇక దైవాదీనమేనంటున్న వైద్యులు!!