Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గజేంద్ర సింగ్ శవం సాక్షిగా నిస్సిగ్గు రాజకీయం!

గజేంద్ర సింగ్ శవం సాక్షిగా నిస్సిగ్గు రాజకీయం!
, గురువారం, 23 ఏప్రియల్ 2015 (11:30 IST)
పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో ఆత్మహత్య హత్య చేసుకున్న రాజస్థాన్ రాష్ట్ర రైతు గజేంద్ర సింగ్ మృతదేహం సాక్షిగా రాజకీయ పార్టీలు నిస్సిగ్గు రాజకీయాలకు తెరతీశాయి. విమర్శలు.. ప్రతివిమర్శలు... వ్యంగ్య వ్యాఖ్యలతో రైతు ఆత్మ మరింత క్షోభించేలా వ్యవహరించారు. ఆప్‌ నేతలు కుమార్‌ విశ్వాస్‌, అశుతో‌షలు ఘటనపై విపరీత వ్యాఖ్యలు చేశారు. 
 
ఆప్‌ ర్యాలీని భగ్నం చేసేందుకు బీజేపీ చేసిన కుట్రగా రైతు ఆత్మహత్యను కుమార్‌ విశ్వాస్‌ అభివర్ణించారు. మరో ఆప్‌ నేత అశుతోష్‌.. ఆప్‌ కార్యకర్తలు చెట్లు ఎక్కడంలో శిక్షణ తీసుకోలేదని, అందుకే వారు రైతును రక్షించడంలో విఫలమయ్యారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘అసలు ఇది కేజ్రీవాల్‌ తప్పిదం. ఆయన స్టేజీ దిగి రైతును రక్షించాల్సింది. ఈసారి ఆయన తప్పకుండా చెట్లు ఎక్కి ప్రజలను రక్షిస్తారు’ అని ముక్తాయించారు. 
 
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమన్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. మోదీ సర్కార్‌ రైతులను శిక్షిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యపై నరేంద్ర మోడీ కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఆప్‌ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్న ఫలితమే ఈ దారుణానికి కారణమని భారతీయ జనతా పార్టీ మండిపడింది. 

Share this Story:

Follow Webdunia telugu