Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాశ్మీరుతో పాటు బీహారును కూడా ఇచ్చేస్తాం... కమ్మగా తీస్కోండి... పాక్‌కు ఖట్జూ సలహా, దేశద్రోహం కేసు

కొంతమందికి నోటిదూల అనేది ఎంత ఆపుకున్నా బయటకు తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఇలాంటి వ్యక్తుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, గౌరవ ప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన మార్కండేక ఖట్జూ ఒకరు. ఈయన ఎప్పుడు చూసినా వెనుకటికి ఎవరో చెప్పినట్లు... నాంజేడు పొదలో నాదో చ

కాశ్మీరుతో పాటు బీహారును కూడా ఇచ్చేస్తాం... కమ్మగా తీస్కోండి... పాక్‌కు ఖట్జూ సలహా, దేశద్రోహం కేసు
, బుధవారం, 28 సెప్టెంబరు 2016 (22:44 IST)
కొంతమందికి నోటిదూల అనేది ఎంత ఆపుకున్నా బయటకు తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఇలాంటి వ్యక్తుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, గౌరవ ప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన మార్కండేక ఖట్జూ ఒకరు. ఈయన ఎప్పుడు చూసినా వెనుకటికి ఎవరో చెప్పినట్లు... నాంజేడు పొదలో నాదో చెయ్యి అన్నట్లు సమస్య రగులుతుంటూ దాంట్లో ఇంకాస్తా నూనె వేసి మంట పెద్దదయితే సంతోషించినట్లు చేస్తుంటారు. 
 
తాజాగా భారత్-పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్త వాతావరణం, కాశ్మీరుపైకి ఉగ్రమూకలను పాకిస్తాన్ ప్రేరేపించడం అంతా తెలిసిందే. ఐతే ఇలాంటి పరిస్థితిలో ఖట్జూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తను చేసిన కామెంట్ల తరహా వ్యాఖ్యలను గతంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి కూడా చేశారంటూ పాకిస్తాన్‌కి సోషల్‌ మీడియా వేదికగా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చేశారు. ఈ మాట అని కాశ్మీరును పాకిస్తాన్ దేశానికి ఇచ్చేందుకు ఆయన ఎవరనేది పక్కనపెడితే, ఆయనపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీనితో సర్దుకుంటూ నేన్నది సీరియస్‌గా తీసుకోవద్దు, జస్ట్ జోక్ అంతే, కాశ్మీరుతో పాటు బీహారును కూడా ఇస్తామంటే పాకిస్తాన్ అదిరి ఛస్తుంది. 
 
ఎందుకంటే బీహార్ అంత భయంకరమైంది అని మరో వివాదాస్పదం చేశాడు. దీనితో బీహార్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీకు మేమెలా కనబడుతున్నామంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. మళ్లీ వారిని బుజ్జగిస్తూ.... అబ్బే బీహార్ అంటే ఏమనుకుంటున్నారు. ఇక్కడ నుంచి గౌతమబుద్ధుడు, అశోకుడు వంటి దిగ్గజాలు వచ్చారు అంటూ పేర్కొన్నారు. కానీ పాట్నాలో మాత్రం ఆయనపై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. అదీ ఖట్జూ నోటిదూల సంగతి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ మమ్మల్ని 'బికారి'ని చేస్తుందేమో? కాపాడండి మహాప్రభో... పాక్ మొర... ఎక్కడ?