Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహారాష్ట్రలో గోవధ నిషేధం.. ఆవు మాంసం విక్రయిస్తే.. ఐదేళ్ల జైలు..!

మహారాష్ట్రలో గోవధ నిషేధం.. ఆవు మాంసం విక్రయిస్తే.. ఐదేళ్ల జైలు..!
, మంగళవారం, 3 మార్చి 2015 (17:38 IST)
మహారాష్ట్రలో గోవధను నిషేధించారు. ఇకపై అక్కడ ఆవు మాంసాన్ని విక్రయించినా.. ఎవరైనా కలిగి ఉన్నా కూడా వాళ్లకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తారు. ఈ కొత్త చట్టానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. అసలు ఈ నిర్ణయం ఇప్పటికి సుమారు 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. 
 
1995లో బీజేపీ - శివసేన ప్రభుత్వం తొలిసారిగా మహారాష్ట్ర జంతు సంరక్షణ బిల్లును ఆమోదించింది. కానీ,  అది ఇప్పుడే అమలులోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలో ఎవరైనా ఆవుమాంసాన్ని విక్రయించినా, లేదా కలిగి ఉన్నా కూడా ఐదేళ్ల వరకు జైలుశిక్ష, రూ. 10 వేల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. 
 
కిరీట్ సోమయ్య నేతృత్వంలోని ఏడుగురు బీజేపీ ఎంపీల బృందం రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆయన ఈ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. దీనికి రాష్ట్రపతి ఆమెదం తెలపడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హర్షం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu