Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇష్టం లేకపోయినా శృంగారం చేయాలంటూ నా భర్త బలవంతంగా రేప్ చేస్తున్నాడు.. భార్య ఫిర్యాదు

ముంబైలో ఓ విచిత్ర కేసు నమోదైంది. అగ్నిసాక్షిగా పెళ్ళాడిన తన భర్త... తనను రేప్ చేస్తున్నట్టు ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమె ఎవరో కాదు.. ఓ బాలీవుడ్ చిత్ర నిర్మాత మేనల్లుడి భార్య. ఈమె తన భర్తపైన

ఇష్టం లేకపోయినా శృంగారం చేయాలంటూ నా భర్త బలవంతంగా రేప్ చేస్తున్నాడు.. భార్య ఫిర్యాదు
, శుక్రవారం, 8 జులై 2016 (14:38 IST)
ముంబైలో ఓ విచిత్ర కేసు నమోదైంది. అగ్నిసాక్షిగా పెళ్ళాడిన తన భర్త... తనను రేప్ చేస్తున్నట్టు ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమె ఎవరో కాదు.. ఓ బాలీవుడ్ చిత్ర నిర్మాత మేనల్లుడి భార్య. ఈమె తన భర్తపైనే కేసు పెట్టింది. 
 
ఈ మేరకు వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో తన భర్త వేధిస్తున్నాడనీ, తన భర్త నగలన్నీ తీసుకున్నాడని, తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడనేది ఆమె ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా తనను వేధించేవాడని, ఇష్టం లేకపోయినా శృంగారం చేయాలంటూ బలవంతం చేసేవాడని తన ఆవేదనను వ్యక్తం చేసింది. 
 
ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్న వెర్సోవా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిపై 376(రేప్), సెక్షన్ 498(ఏ)(భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిర్మాతకు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్‌ బాధ్యతలు నిందితుడు చూసుకునేవాడని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ ఆదాయం ఎంత..? సీఎం చంద్రబాబుకు ప్రశ్న: ఆధార్‌లో అదనపు వివరాల సేకరణ