Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యం మత్తులో ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చిన తండ్రి.. ఎక్కడ?

భార్యపై కోపంతో ఓ భర్త మద్యం మత్తులో ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి చంపాడు. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం తిరునల్వేలి జిల్లాలో జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ తండ్రి

మద్యం మత్తులో ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చిన తండ్రి.. ఎక్కడ?
, శుక్రవారం, 19 ఆగస్టు 2016 (09:20 IST)
భార్యపై కోపంతో ఓ భర్త మద్యం మత్తులో ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి చంపాడు. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం తిరునల్వేలి జిల్లాలో జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ తండ్రి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న ముగ్గురు కుమార్తెలను కోల్పోయిన తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది.
 
వివరాల్లోకి వెళితే... తిరునల్వేలి జిల్లా తరువై అమ్మనకోవిల్‌కు చెందిన రాజశేఖర్‌ (29), మేఘల (26) దంపతులకు ముత్తుసెల్వి (8), కావ్య (6), ఆరతి (3) అనే ముగ్గురు కుమార్తెలున్నారు. కూలీగా పనిచేస్తున్న రాజశేఖర్‌కు మద్యపానం అలవాటుంది. రోజూ సంపాదించిన డబ్బుతో  పీకల దాకా తాగి రాత్రిపూట ఇంటికొచ్చి భార్యతో తగాదా పడుతుండేవాడు. 
 
బుధవారం రాత్రి యథా లాపంగా రాజశేఖర్‌ మద్యం మత్తులో ఇంటికి చేరుకొని భార్యతో మళ్లీ గొడవపడ్డాడు. ఉన్నట్టుండి అతను మేఘల గొంతునులిమి చంపేందుకు ప్రయత్నించడంతో ఆమె పక్కనే ఉన్న పుట్టింటికి పారిపోయింది. భార్య తన నుంచి తప్పించుకెళ్లిందన్న కోపంతో రాజశేఖర్‌ నిద్రపోతున్న ముగ్గురు కుమార్తెలకు కూల్‌డ్రింక్స్‌లో విషం కలిపి బలవంతంగా తాగించాడు. దీంతో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ విషయం మద్యంమత్తులో ఉన్న రాజశేఖర్‌ గమనించకుండా ఆ ముగ్గురి శవాల పక్కనే పడుకున్నాడు. గురువారం ఉదయం నిద్ర లేచిన రాజశేఖర్‌ తన కుమార్తెలు ముగ్గురూ శవాలుగా పడి ఉండడాన్ని గుర్తించాడు. మత్తులో తానే చంపిన విషయం గుర్తుకు రావడంతో లబోదిబోమన్నాడు. ఆ వెంటనే బ్లేడుతో చేతులను కోసుకుని, వంటిపై కిరోసిన్ కుమ్మరించుకుని నిప్పంటించుకున్నాడు. 
 
మంటలు అల్లుకోవడంతో అతడు పెట్టిన గావుకేకలు చుట్టుపక్కల వారిని పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని కాపాడారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెంపుడు కుక్క మాయం.. నిద్రాహారాలు మానిన ఆదిత్య పిల్లలు.. పట్టుకుంటే పారితోషికం..