Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉపాధ్యాయురాలిపై గ్యాంగ్ రేప్: రెండేళ్లుగా ఇదే తంతు.. జననాంగాల్లో గాయాలు!

ఉపాధ్యాయురాలిపై గ్యాంగ్ రేప్: రెండేళ్లుగా ఇదే తంతు.. జననాంగాల్లో గాయాలు!
, శనివారం, 13 ఫిబ్రవరి 2016 (10:01 IST)
సమాజం తలదించుకునే విధంగా నలుగురు వ్యక్తులు ఉపాధ్యాయురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి, అతని సోదరులు, మరో వ్యక్తి కలిసి రెండేళ్లుగా తనపై సామూహిక అత్యాచారం చేస్తున్నారని ఫరీదాబాద్‌కి చెందిన మహిళ తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె సమాచారంతో అక్కడికి చేరుకునేసరికి బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బీకే ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉందని, ఆమె వాగ్మూలం తీసుకోవడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు.
 
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ, అపాయమేమి లేదని చెప్పారు. ఆమె జననాంగాల్లో తీవ్ర గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. అసలు విషయానికొస్తే ఫరీదాబాద్‌లోని చత్రవాలా ప్రాంతంలో ఆ మహిళ ఉద్యోగరీత్యా ఉంటుంది. తల్లిదండ్రులకు గురువారం ఫోన్‌ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారు వెళ్లేసరికి బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారని పోలీసులు తెలిపారు. 
 
సుఖ్‌దేవ్‌ నగర్‌లోని స్వీట్‌షాపు యజమాని, గోవింద్‌పురి నివాసి, ఈయన ఇద్దరు సోదరులు కలసి ఆమెపై ఈ దారుణానికి పాల్పడినట్టు వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఫరీదాబాద్‌ పోలీసు అధికారి కన్వర్‌ సింగ్‌ చెప్పారు. ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత ఉపాధ్యాయురాలి వాగ్మూలం తీసుకుని ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu