Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరుణానిధి గుండెపోటుతో మరణించినట్లు ఫేస్‌బుక్‌లో వార్తలు.. డీఎంకే షాక్

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై నానా రకాలుగా వార్తలొస్తున్న నేపథ్యంలో.. ఆ వార్తలు ప్రస్తుతం డీఎంకే చీఫ్ కరుణానిధివైపు మళ్లాయి. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గుండెపోటుతో కరుణానిధి మరణించినట్లు ఫేస్‌బుక్‌ల

కరుణానిధి గుండెపోటుతో మరణించినట్లు ఫేస్‌బుక్‌లో వార్తలు.. డీఎంకే షాక్
, ఆదివారం, 16 అక్టోబరు 2016 (16:08 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై నానా రకాలుగా వార్తలొస్తున్న నేపథ్యంలో.. ఆ వార్తలు ప్రస్తుతం డీఎంకే చీఫ్ కరుణానిధివైపు మళ్లాయి. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గుండెపోటుతో కరుణానిధి మరణించినట్లు ఫేస్‌బుక్‌లో వార్తలు రావడంతో కలకలం సృష్టించాయి. 'అమ్మా సింగం సవితా' ఐడీతో ఈ వార్తలను పోస్ట్ చేశారు. ఇందుకు నిరసనగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు ఆ ఫిర్యాదు స్వీకరించలేదని వాణియంబాడి డీఎంకే న్యాయవాదుల విభాగానికి చెందిన దేవకుమార్‌ ఆరోపిస్తున్నారు. 
 
కరుణానిధిపై వదంతులు సృష్టించిన సవితాపై కేసు నమోదుచేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ జరుపుతున్నారు. సీఎం జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తున్నట్లు పలువురిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా కరుణానిధిపై వదంతులు సృష్టిస్తున్న వారిని కూడా అరెస్టుచేయాలని డిమాండ్‌ చేశారు
 
శనివారం ఉదయం అనకట్టు ఎమ్మెల్యే నందకుమార్, తిరుపత్తూరు ఎమ్మెల్యే నల్లతంబి వేలూరు ఎస్పీ పగలవన్ వద్ద ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో వదంతులు పెట్టిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిబాబాను పూజించకూడదు: స్వరూపానంద సరస్వతి