Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అమ్మ బతికుందో లేదో చెప్పాలి' : ఏడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ వ్యాఖ్యలు

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై ఆ పార్టీ బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించాలని ఆమె కోరా

'అమ్మ బతికుందో లేదో చెప్పాలి' : ఏడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ వ్యాఖ్యలు
, సోమవారం, 5 డిశెంబరు 2016 (13:16 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై ఆ పార్టీ బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించాలని ఆమె కోరారు. 
 
ప్రస్తుతం జయలలిత ఆరోగ్యం విషమంగా ఉందంటూ అపోలో ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన అధికారిక హెల్త్ బులిటెన్‌పై ఆమె స్పందించారు. జయలలిత ఆరోగ్యంపై పార్టీ వర్గాలు చేస్తున్న ప్రకటనల్లో పారదర్శకత లేదని ఆమె అన్నారు. ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉందని శశికళ పుష్ప అభిప్రాయపడ్డారు.
 
జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాక్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, కేంద్ర రాష్ట్ర స్థాయి నేతలు వెళ్లినా వారిలో ఏ ఒక్కరికీ జయలలితను చూసే భాగ్యం కల్పించలేదన్నారు. దీనికి కారణమేంటని ఆమె ప్రశ్నించారు. 
 
జయలలిత ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న వదంతుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని, ఉద్రిక్త పరిస్థితుల నుంచి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టాలని కోరారు. గత కొన్ని రోజులుగా జయలలిత కొన్ని అనధికారికశక్తుల చేతుల్లో ఉన్నారనీ, దీనిపై ప్రధాని మోడీ తక్షణం జోక్యం చేసుకోవాలన్నారు. 
 
అంతేకాకుండా జయలలిత ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆమెను విదేశాలకు తీసుకెళ్లడం లేదా ఢిల్లీలోని ఎయిమ్స్ వంటి వైద్యశాలలకు తరలించి చికిత్స చేయించాలని శశికళ కోరారు. ఇదే అంశంపై పార్టీ నేతలెవ్వరూ నోరు మెదపడం లేదన్నారు. కానీ, తాను డిమాండ్ చేయడం వల్లే ఆమె ఆరోగ్యంపై ఒక స్పష్టమైన ప్రకటన వెల్లడించారని చెప్పారు. ఇపుడు కూడా ఆమె జయలలిత ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలని శశికళ డిమాండ్ చేశారు.
 
 
గత రెండున్నర నెలలుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత పూర్తిగా కోలుకుందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన అనంతరం.. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం మళ్లీ విషమించిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హార్ట్ అసిస్టెడ్ డివైజ్ అమ్మకు ఎలా అమర్చారు..? అమ్మకు గుండె కొద్దిసేపు ఆగిందా?