Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాల ప్యాకెట్ తెచ్చేందుకు వెళ్లి.. బాంబును కనిపెట్టా: రైల్వే గేట్ మేన్ సత్పాల్

పాల ప్యాకెట్ తెచ్చేందుకు వెళ్లి.. బాంబును కనిపెట్టా: రైల్వే గేట్ మేన్ సత్పాల్
, మంగళవారం, 28 జులై 2015 (19:08 IST)
పాల ప్యాకెట్ తెచ్చేందు వెళ్లి.. బాంబును కనిపెట్టానని రైల్వే గేట్ మేన్ సత్పాల్ అన్నారు. పంజాబ్‌లోని గురు దాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్‌ను ఆక్రమించేందుకు ముందు టెర్రరిస్టులు భారీ విధ్వంసానికి పూనుకున్నారు. అయితే ఈ విధ్వంసాన్ని సత్పాల్ అడ్డుకున్నారు. అసలేం జరిగిందంటే.. గురు దాస్ పూర్ జిల్లాలో చొరబడిన టెర్రరిస్టులు తెల్లవారుజామున ఓ వంతెనపై బాంబులు అమర్చారు. 
 
ఈ బాంబులను గుర్తించిన రైల్వే గేట్ మేన్ సత్పాల్ స్పందించారు. "రోజూలాగే పాలప్యాకెట్లు తెచ్చుకునేందుకు రైల్వే వంతెనపక్క నుంచి వెళ్తుండగా, వంతెనపై వైర్లు అనుమానాస్పదంగా కనిపించడంతో అటుగా వెళ్తున్న ఓ యువకుడ్ని పిలిచి స్టేషన్‌కు సమాచారం పంపాను. 
 
డ్యూటీలో ఉన్న దర్శన్ కుమార్ వెంటనే స్పందించి, అప్పటికే బయల్దేరిన ఓ ట్రైన్‌ను వంతెనను చేరుకునే లోపు ఆపేందుకు ఓ గార్డును పంపారు. గార్డు పరుగున వెళ్లి సకాలంలో ఆ ట్రైన్‌ను ఆపారని గుర్తు చేసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని సత్పాల్ చెప్పుకొచ్చారు. ట్రైన్ అక్కడికి చేరుకునే సమయంలో అందులో అనేక మంది ప్రయాణికులు ఉన్నారని సత్పాల్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu