Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాలి జనార్థన్ రెడ్డి కూతురి వివాహం.. ఐటీకి లెక్కలు చెప్పిన మైనింగ్ కింగ్.. కొన్నిచోట్ల పొంతన లేదట..

కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు వివాహన్ని అంగరంగవైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు వివాహ పత్రిక వెరైటీగా మ

గాలి జనార్థన్ రెడ్డి కూతురి వివాహం.. ఐటీకి లెక్కలు చెప్పిన మైనింగ్ కింగ్.. కొన్నిచోట్ల పొంతన లేదట..
, బుధవారం, 30 నవంబరు 2016 (08:40 IST)
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు వివాహన్ని అంగరంగవైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు వివాహ పత్రిక వెరైటీగా ముద్రించారు. ఈ పత్రికే పెద్ద సంచలనంగా మారింది. పత్రికతో పాటు వివాహ వేడుకలను కూడ అంతే ఘనంగా ఆయన నిర్వహించారు. అయితే గాలి కూతురు వివాహంపై ఐటీ కన్ను పడింది. 
 
అంగరంగ వైభవంగా, అట్టహాసంగా కూతురి పెళ్లి చేసి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దృష్టిలో పడిన అక్రమ గనుల కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి.. ఆ పెళ్లి ఖర్చులపై వివరాలు ఇచ్చారు. ఆ మేరకు ఐటీ శాఖకు ఆయన లెక్కలు సమర్పించారు. తాము అడిగిన 15 ప్రశ్నలకు గాలి జనార్దన్‌రెడ్డి సమగ్ర వివరాలు అందజేశారని ఐటీ అధికారులు వెల్లడించారు. 
 
పెళ్ళి మండపం, అలంకరణ, భోజన ఏర్పాట్లు, వస్త్రాలు, ఆభరణాలు, కళాకారులు, అర్చకులకు చెల్లించిన పైకం వంటి తదితర  వివరాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కానీ తమ వద్ద ఉన్న వివరాలకు ‘గాలి’ సమర్పించిన వివరాలకు కొన్ని చోట్ల పొంతన కుదరడం లేదని.. అవసరమైతే గాలిని ప్రశ్నించేందుకైనా రెడీ అని ఐటీ అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఆర్డీఏలో పారదర్శకతకు పెద్దపీట