Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫేస్ బుక్ ప్రేమ: టెకీపై 3 రోజులు రేప్ చేసి.. అసభ్య ఫోటోలతో..?

ఫేస్ బుక్ ప్రేమ: టెకీపై 3 రోజులు రేప్ చేసి.. అసభ్య ఫోటోలతో..?
, సోమవారం, 28 జులై 2014 (16:17 IST)
ఫేస్ బుక్ ఓ టెకీ కొంపముంచింది. సరదాగా ప్రారంభించిన ఛాటింగ్ టెకీని ఇబ్బందుల్లోకి నెట్టింది. గుజరాత్‌లోని భావ్ నగర్ ప్రాంతానికి చెందిన రిషభ్ కతోడియా (25) ఇండోర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఫేస్ బుక్‌లో ఇండోర్‌కి చెందిన సాఫ్ట్ వేరే ఇంజనీర్ (23) పరిచయం చేసుకుని ఛాటింగ్ చేసేవాడు. పరిచయం కాస్త పెరిగాక జనవరి 4న ఇండోర్ వచ్చి సైట్ సీయింగ్‌కి తీసుకెళ్లాడు. 
 
తరువాత కాఫీ తాగేందుకు హోటల్ గదికి ఆహ్వానించి అక్కడ కాఫీలో మత్తుమందు కలిపి మొబైల్ ఫోన్‌లో అసభ్యంగా వీడియో తీశాడు. రెండు నెలల తరువాత ఫోన్ చేసి వడోదరలో గతంలో తామున్న ప్రాంతానికి రావాలని లేని పక్షంలో తాను తీసిన వీడియో ఇంటర్నెట్ లో పెడతానని భయపెట్టాడు. దీంతో అతను సూచించిన ప్రాంతానికి వెళ్లిన ఆమెను మూడు రోజుపాటు పలుమార్లు అత్యాచారం చేశాడు. 
 
తర్వాత కొంత కాలానికి ఆమె అసభ్య ఫోటోలు ఆమెకే పంపి తనను పెళ్లి చేసుకోవాలని లేని పక్షంలో ఇవే ఫోటోలు ఆమె తల్లిదండ్రులకు పంపుతానని బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. లేని పక్షంలో చంపుతానని బెదిరించసాగాడు. ఆ కీచకుడి బాధ భరించలేని యువతి పోలీసులను ఆశ్రయించి జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై అత్యాచారం, మోసం, కుట్రపూరితంగా మహిళ పట్ల వ్యవహరించడం, ఐటీ యాక్ట్ వంటి సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu