Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళలో ఇక తాగడం, జోగడం, ఊగడం కుదరండి!

కేరళలో ఇక తాగడం, జోగడం, ఊగడం కుదరండి!
, శనివారం, 23 ఆగస్టు 2014 (15:19 IST)
కేరళలో ఇక తాగడం, జోగడం, ఊగడం ఉండదట. ఇదేంటి అంటూ మందుబాబులు అనుకుంటున్నారా.. నిజం. కేరళ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలులోకి రానుంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉన్న 300 బార్లలో అమ్మకాలు నిషేధిస్తున్నట్టు కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ప్రకటించి వాటి లైసెన్సులు రద్దుచేశారు. 
 
ఈ మహమ్మారిని అరికట్టేందుకు ముందుగా ఫైవ్ స్టార్ హోటళ్లను ఎన్నుకున్నామని, దశల వారీగా రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తామని చాందీ చెప్పుకొచ్చారు. 
 
మద్యం సమాజానికి పట్టిన జాఢ్యమని, దీని దుష్ప్రభావాల బారినపడి ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధానికి అందరూ సిద్ధం కావాలని ఉమెన్ చాందీ పిలుపునిచ్చారు. దేశంలో అత్యధిక మద్యం వినియోగించే రాష్ట్రంగా కేరళ ప్రథమ స్థానంలో నిలిచిందని సీఎం వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu