Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చుక్కేసి రోడ్డుపై తూలిన యువతి.. ఆలయానికంటూ.. టాస్మాక్ అంగడికి వెళ్ళి..?!

పురుషులే తప్పతాగి మైకంలో ఇంట్లో గొడవ చేయడం లేకుంటే వీధుల్లో పడి దొర్లడం హంగామా చేయడం చూసివుంటాం. అయితే ఓ యువతి మద్యానికి బానిసై.. రోడ్డుపై దొర్లుతూ నానా హంగామా చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళ

చుక్కేసి రోడ్డుపై తూలిన యువతి.. ఆలయానికంటూ.. టాస్మాక్ అంగడికి వెళ్ళి..?!
, గురువారం, 4 ఆగస్టు 2016 (13:07 IST)
పురుషులే తప్పతాగి మైకంలో ఇంట్లో గొడవ చేయడం లేకుంటే వీధుల్లో పడి దొర్లడం హంగామా చేయడం చూసివుంటాం. అయితే ఓ యువతి మద్యానికి బానిసై.. రోడ్డుపై దొర్లుతూ నానా హంగామా చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం, మదురై సమయనల్లూరుకు చెందిన మంజు అనే అమ్మాయికి మందు తాగే అలవాటుంది. ఈ నేపథ్యంలో మేలూరు ప్రాంతంలోని ఓ ఆలయానికి కుటుంబంతో పాటు మంజు వెళ్ళింది. 
 
అయితే... ఆలయానికి వెళ్తూ వెళ్తూ వారి కుటుంబీకులకు తెలియకుండానే మేలూరులోని ఓ టాస్మాక్ అంగట్లో చుక్కేసింది. ఇక తాగిన మైకంలో  ఊగుతూ నడుచుకుంటూ రోడ్డుపై దొర్లుతూ నానా రభస చేసింది. ఆపై నడవలేక రోడ్డుపైనే పడిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మంజును మందలించి వారి కుటుంబీకులతో పంపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామాయణంలో మునులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్లు.. జగన్ నీకు బుద్ధుందా?