Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహాలో పండుగ కోలాహలం.. బీజేపీ తొలి సీఎంగా ఫడ్నవిస్ నేడే ప్రమాణం..

మహాలో పండుగ కోలాహలం.. బీజేపీ తొలి సీఎంగా ఫడ్నవిస్ నేడే ప్రమాణం..
, శుక్రవారం, 31 అక్టోబరు 2014 (13:21 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. దీంతో మహారాష్ట్రలో పండుగ వాతావరణం నెలకొంది. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించనున్నారు. ఐతే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి శివసేన పార్టీ నేతలెవరూ ప్రమాణం చేసే అవకాశం లేదని తెలుస్తోంది. 
 
ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ప్రమాణోత్సవంలో నాగపూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఫడ్నవిస్‌తో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రమాణం చేయించనున్నారు. ముఖ్యమంత్రితోపాటు సీనియర్ నేతలు ఏక్‌నాథ్ ఖడ్సే, సుధీర్ ముంగాన్‌త్వార్, వినోద్ తవ్డే, పంకజ ముండే ప్రమాణం చేసే అవకాశాలున్నాయని ఓ సీనియర్ నేత తెలిపారు.
 
ఈ ప్రమాణోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, కార్పొరేట్, క్రీడా రంగాల ప్రముఖులు, బాలీవుడ్ తారలు, సెలబ్రిటీలు హాజరుకానున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu