డిప్రెషన్ కారణమట.. 45 రోజుల పసికందును గొంతుకోసి చంపేసిన తల్లి

సెల్వి
శుక్రవారం, 22 ఆగస్టు 2025 (20:33 IST)
మానసిక ఒత్తిడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. డిప్రెషన్‌తో బాధపడే ఓ మహిళ తన 45 రోజుల పసికందును గొంతు కోసి చంపిన దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తల్లి నేహా మానసిక ఒత్తిడిలో వుందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి అయ్యింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
 
తన బిడ్డను హత్య చేసింది తానేనని ఆ తల్లి నేరాన్ని అంగీకరించిందని, ఆమెపై బిఎన్‌ఎస్ సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసినట్లు డిసిపి అగర్వాల్ తెలిపారు. "గురువారం ద్వారకాపురి ప్రాంతంలోని పార్ధి సెటిల్‌మెంట్‌లో ఇంటి లోపల తల్లి తన బిడ్డ (ప్రియాన్ష్) గొంతును పదునైన వస్తువుతో కోసిందని దర్యాప్తులో తేలింది. 
 
నేహా మానసిక స్థితి అస్థిరంగా ఉందని, గతంలో ఆమె శిశువును గొంతు కోసి చంపడానికి ప్రయత్నించిందని నిందితుడి బంధువులు చెప్పారని డిసిపి అగర్వాల్ తెలిపారు. ఈ కేసు పట్ల దర్యాప్తు జరుగుతుంది. నిందితురాలు నేహా మానసిక ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నామని డిసిపి అగర్వాల్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments