Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పుల బాధతో కన్నకుమార్తెను హత్య చేసిన కన్నతండ్రి!

భారతదేశంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. వర్షాలు పడక సరైన సమయంలో పంటలు చేతికందక పోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు లేక కష్టాలపాలైన ఒక నిరుపేద రైతు కనికరం లేకుండా కన్నకూతురునే హ

అప్పుల బాధతో కన్నకుమార్తెను హత్య చేసిన కన్నతండ్రి!
, సోమవారం, 1 ఆగస్టు 2016 (10:49 IST)
భారతదేశంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. వర్షాలు పడక సరైన సమయంలో పంటలు చేతికందక పోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు లేక కష్టాలపాలైన ఒక నిరుపేద రైతు కనికరం లేకుండా కన్నకూతురునే హతమార్చిన ఘటన హర్యానా రాష్ట్రంలో రేవారి జిల్లా బెరంపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఆ వివరాలను పరిశీలిస్తే... మహేందర్‌ సింగ్‌ అనే రైతుకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. వ్యవసాయానికి చేసిన అప్పు రోజురోజుకి పెరిగిపోతూనే పోయింది. అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడడంతో మహేందర్ తీవ్ర మనస్థాపానికి గురైయ్యాడు. ఒక పక్క అప్పులు మరో పక్క కన్న కూతురు పెళ్లి వయస్సుకు రావడంతో ఆయన మరింత దిగులు చెందడం ప్రారంభించాడు. 
 
కూతురు వయస్సుకు రావడంతో ఆమె పెళ్లి చేయలేమోనని భయపడి ఆమెను చంపేస్తే సరిపోతుందని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయన భార్య, కుమారులు బయటకు వెళ్లిన సమయంలో ఆమెను గొడ్డలితో దారుణంగా నరికి చంపేశాడు. అప్పటికప్పుడే బాలిక కుప్పుకూలి ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్నమహేందర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో దారుణం : 16 యేళ్ళ అమ్మాయిపై రేప్... ఆపై హత్య...