Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళా ఖైదీలతో మసాజ్.. మగ ఖైదీలతో మందు పార్టీ.. డిప్యూటీ జైలర్ బెల్లీ డ్యాన్స్ (వీడియో)

మహిళా ఖైదీలతో మసాజ్.. మగ ఖైదీలతో మందు పార్టీ.. డిప్యూటీ జైలర్ బెల్లీ డ్యాన్స్ (వీడియో)
, గురువారం, 11 ఫిబ్రవరి 2016 (16:03 IST)
కొంతమంది తెలిసో.. తెలియకో లేక క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైలుకెళుతుంటారు. ఇలాంటి ఖైదీలు న్యాయస్థానాలు తమకు విధించే శిక్షలు కంటే.. జైలు సిబ్బంది పెట్టే బాధలు భరించలేరు. ఫలితంగా పలువురు ఖైదీలు బలవన్మరణాలకు కూడా పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఆత్తూరు సబ్ జైలు డిప్యూటీ జైలర్ రాసలీలలు, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ జైలర్.. సబ్ జైలులోని మగ ఖైదీలతో మందుకు పార్టీ చేసుకుంటూ, మహిళా ఖైదీలతో మసాజ్ చేయించుకుంటూ రాజభోగం అనుభవిస్తూ వచ్చాడు. అంతేనా.. భారత గణతంత్ర వేడుకల రోజున దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. కానీ, ఈ జైలర్ మాత్రం పూటుగా మద్యం సేవించి.. బెల్లీ డ్యాన్స్ చేసి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ డిప్యూటీ జైలర్ పేరు శంకరన్. 
 
గణతంత్ర వేడుకల రోజున చెన్నైలోని ఓ హోటల్‌లో బస చేశాడు. తన గదికి మద్యం తెప్పించుకుని పీకల దాకా సేవించాడు. కైపు తలకెక్కడంతో యూనిఫామ్‌తోనే బెల్లీ డాన్స్ చేశాడు. ఆ దృశ్యాలను ఎవరో సెల్‌ఫోన్‌లో వీడియో తీసి వాట్సప్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ విషయం జైలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు విచారణ చేపట్టారు. 
 
ముఖ్యంగా.. ఆత్తూరు జైలులోని ఖైదీల వద్ద విచారించగా శంకరన్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. గతంలో జైలుగదిలోనే మహిళా ఖైదీలతో మసాజ్‌ చేయించుకునేవాడని, ఆయన విధి నిర్వహణలో పలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఖైదీలంతా వెల్లడించారు. వీటన్నింటికి తోడు చెన్నైలో తాగిన మైకంలో బెల్లీ డాన్స్ చేయడంతో ఆయనను సస్పెండ్‌ చేస్తూ సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ సెందిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. 6 మాసాల్లో పదవీ విరమణ కానున్న తరుణంలో శంకరన్ బెల్లీడాన్స్ కారణంగా సస్పెన్ష్‌నకు గురికావడం గమనార్హం.
 

Share this Story:

Follow Webdunia telugu