Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంబేద్కర్ రింగ్ టోన్ పెట్టుకున్నాడనీ...! గుద్ది చంపేశారు....!!

అంబేద్కర్ రింగ్ టోన్ పెట్టుకున్నాడనీ...! గుద్ది చంపేశారు....!!
, శుక్రవారం, 22 మే 2015 (21:21 IST)
కారా కితిహీ హల్లా మజ్ బూత్ బీమచా కిల్లా... అనే రింగ్ టోన్ పెట్టుకున్నందుకు ఓ దళిత యువకుణ్ణి పిడి గుద్దలతో చంపేశారు.  మీరంతా కోరుకుంటే గట్టిగా గర్జించండి.. భీమ్ దుర్గం చాలా దృఢమైనది దాని అర్థం. ఇది అంబేద్కర్ ను ఊటంకించే ఓ పాట. ఆ పాట తన సెల్ లో రావడమే నేరమై పోయింది.  ఓ దళిత యువకుడిని షిరిడీలో చావకొట్టారు. మే 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి 
 
సాగర్ షెజ్వాల్ (21) అనే దళిత యువకుడు నర్సింగ్ చదువుతున్నాడు. షిరిడీలో ఓ వివాహ కార్యక్రమానికి మే 16న హాజరయ్యాడు. సరిగ్గా మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో అతడు మరో వరుసకు సోదరులయ్యే ఇద్దరు వ్యక్తులతో కలిసి ఓ షాపులో కూర్చున్నాడు. అదే సమయంలో అతడికి ఫోన్ రాగా దానికి రింగ్ టోన్గా అంబేద్కర్ను ఉద్దేశించిన పాట అయిన కారా కితిహీ హల్లా మజ్ బూత్ బీమచా కిల్లా అనే రింగ్ టోన్ వచ్చింది.

దీంతో అక్కడే కూర్చున్న ఎనిమిదిమంది వ్యక్తులు కలిసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలంటూ బెదిరించారు. ఆ క్రమంలో వాగ్వాదం నెలకొని బీర్ బాటిల్ తీసుకొని సాగర్ తలపై బలంగా కొట్టారు. అనంతరం పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తొక్కేశారు. ఆ తర్వాత బయటకు ఈడ్చుకెళ్లి బైక్పై పడేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు. అక్కడ బైక్తో పలుమార్లు తొక్కించారు.
 
అంతటితో ఆగకుండా ఓ బండరాయిని తీసుకొని పాశవికంగా అతడి దేహాన్ని చిద్రం చేసి వెళ్లిపోయారు. అతడి తరుపు బంధువుల ఫిర్యాదు మేరకు గాలింపులు చేపట్టిన పోలీసులకు షింగ్వే అనే గ్రామం వద్ద సాగర్ మృతదేహం లభించింది. కానీ, అతడి ఫోన్ మాత్రం లభించలేదు. అయితే, నిందితులను అరెస్టు చేసేందుకు షాప్ వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజీ సహాయపడింది. దాని ఆధారంగా ఇద్దరిని గోవాలో ఒకరిని పుణెలో, మరొకరిని షిరిడీలో అరెస్టు చేశారు. మరో నలుగురిని అరెస్టు చేయాల్సి ఉంది. దాడికి పాల్పడిన వారంతా కూడా డామినెట్ మరాఠా, ఓబీసీ కులాలకు చెందినవారిగా పోలీసులు తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu