Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాయావతిపై పోటీకి సిద్ధం.. రాఖీ సావంత్ ప్రకటన.. మోడీపై అపారమైన నమ్మకం ఉంది..

యూపీ మాజీ సీఎం మాయావతికి సినిమా నటి, ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ షాక్ ఇవ్వనుంది. సాక్షత్తూ కేంద్రమంత్రి, ఉత్తరప్రదేశ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రాందాస్ అథవాలే మాయావతికి రాఖీ పోటీ అని ప్రకటించారు. ఇ

మాయావతిపై పోటీకి సిద్ధం.. రాఖీ సావంత్ ప్రకటన.. మోడీపై అపారమైన నమ్మకం ఉంది..
, మంగళవారం, 15 నవంబరు 2016 (11:38 IST)
యూపీ మాజీ సీఎం మాయావతికి సినిమా నటి, ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ షాక్ ఇవ్వనుంది. సాక్షత్తూ కేంద్రమంత్రి, ఉత్తరప్రదేశ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రాందాస్ అథవాలే మాయావతికి రాఖీ పోటీ అని ప్రకటించారు. ఇందుకు రాఖీసావంత్ సైతం తన అంగీకారం తెలిపారు. అథవాలే తనకు తండ్రిలాంటి వాడని.. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబుడి వుండేందుకు తాను సిద్ధమని ప్రకటించింది. ఈ క్రమంలో త్వరలో జరగనున్న యూపీ ఎన్నికల్లో మాయావతిపై పోటీ చేయమని కోరితే తాను అందుకు సిద్ధమని రాఖీసావంత్ ప్రకటించారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్టంలో ఓటరుగా నమోదు చేసుకోని రాఖీసావంత్ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నిస్తే... తాను పారాచూట్ అభ్యర్థిగా యూపీ ఎన్నికల బరిలోకి దిగుతానని తెలిపారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ,ఆర్పీఐ పార్టీలు కలిసి పోటీచేస్తాయని, తాను రెండు పార్టీల ప్రచారంలో పాల్గొంటానని రాఖీ వెల్లడించారు. తనకు ప్రధాని నరేంద్రమోడీపై అపారమైన నమ్మకం ఉందని, అథవాలే కేంద్రమంత్రిగా కేంద్రంలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నారని రాఖీ వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూటుగా మద్యం సేవించింది.. మత్తు దిగేందుకు మహిళ బుగ్గ కొరికేసింది..