Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇరోమ్ చాను షర్మిల విడుదలకు మణిపూర్ కోర్టు ఆదేశం!

ఇరోమ్ చాను షర్మిల విడుదలకు మణిపూర్ కోర్టు ఆదేశం!
, బుధవారం, 20 ఆగస్టు 2014 (09:39 IST)
మణిపూర్ పౌర హక్కుల మహిళా నేత ఇరోమ్ షర్మిల చానును విడుదల చేయాలని స్థానిక సెషన్స్‌కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ రాష్ట్రంలో అమలులో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఎత్తివేయాలంటూ ఇరోమ్ గత 14 ఏళ్లగా నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. 
 
మణిపూర్ ఐరన్ లేడీగా పిలిచే ఈ 42 ఏళ్ల ఇరోమ్‌ షర్మిలపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి జుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. అప్పట్నుంచి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ముక్కుద్వారా ద్రవ ఆహారాన్ని అందజేస్తున్నారు. అయితే సెక్షన్ 309 కింద ఆమెపై మోపిన ఆత్మహత్యాయత్నం ఆరోపణలు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. 
 
జుడీషియల్ కస్టడీలో ఉన్న షర్మిలను తక్షణం విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును కోర్టు తప్పుపట్టింది. 2000 నవంబర్‌లో అస్సాం రైఫిల్స్ దళాలు ఇంఫాల్ ఎయిర్‌పోర్టు వద్ద జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు. దీనికి నిరసగా సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరించుకోవాలని పౌర హక్కుల నేత ఇరోమ్ షర్మిల నిరాహార దీక్షకు దిగారు. 

Share this Story:

Follow Webdunia telugu